దీక్ష- దివాస్ వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది మాజీ కార్పొరేటర్ మాధవరం రోజా దేవి రంగారావు
రిపోర్టర్ సతీష్ (తెలంగాణ కెరటం)
వివేకానంద నగర్ డివిజన్ శేరిలింగంపల్లి నియోజకవర్గం లోని మాధవరం నగర్ కాలనీ డివిజన్ పార్టీ కార్యాలయం నందు దీక్ష దివాస్ సందర్భంగా స్థానిక నాయకులతో కలిసి పార్టీ జెండాని ఆవిష్కరించి అనంతరం కెసిఆర్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మాజీ కార్పొరేటర్ మాధవరం రోజా దేవి
కార్పొరేటర్ రోజా దేవి మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకి ఇవాళ శుభకరమైన రోజు ఎందుకంటే మనకు తెలంగాణ రాష్ట్ర సాధన ఎన్నో ఏళ్లుగా కష్టపడిన రానీ తెలంగాణను కెసిఆర్ గారు 2001లో పార్టీని స్థాపించి ఉద్యమం నడిపించి తెలంగాణ ప్రజలందరికీ ఏకతాటిపైకి తీసుకువచ్చి 29 నవంబర్ 2009 అమరణ నిరాహార దీక్ష చేపట్టి తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే నినాదం తోటి ప్రారంభించి పది రోజులు దీక్ష చేయడం వలన ఆరోజు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణని గత్యంతరం లేని పరిస్థితిలో 9 డిసెంబర్ 2009 నాడు తెలంగాణ నీ ప్రకటించి నందున 2 జూన్ 2014 రోజు నా తెలంగాణను ఏర్పాటు చేసి ప్రజలకు విముక్తి కలిగించిన దాంట్లో కేసీఆర్ విజయం సాధించడం జరిగింది కావున ఈరోజు తెలంగాణ ప్రజలు మర్చిపోలేని రోజు అలాగే ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ అలాంటి పరిస్థితులను తెలంగాణ ప్రజలకి చూపిస్తున్నారు కావున మరొకసారి తెలంగాణ ప్రజలందరూ కూడా కేసీఆర్ వైపు ఉండి మళ్లీ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రినీ చేసుకునే విధంగా ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు గొట్టుముక్కల పెద్ద భాస్కరరావు, మాచర్ల భద్రయ్య, వేముల ఆంజనేయులు, జగదీష్ గౌడ్, బి ఆర్ ఎస్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



