Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

మంత్రిపై అసత్య ఆరోపణలు... ఖండించిన చిట్టిబాబు

Author
Posted By TELANGANA KERATAM
| 04 Nov 2026, 07:14 AM | 12 | Politics, తెలంగాణ
మంత్రిపై అసత్య ఆరోపణలు... ఖండించిన చిట్టిబాబు
మంత్రిపై అసత్య ఆరోపణలు... ఖండించిన చిట్టిబాబు
తెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 3, నవంబర్
దేశ రాజధాని ఢిల్లీలోని ప్రముఖ శాంగ్రిలా హోటల్‌లో కాంగ్రెస్ పార్టీకి చెందిన రాష్ట్ర మంత్రి దామోదర రాజనర్సింహ , జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు మధ్య వాగ్వాదం జరిగిందంటూ మీడియాలో వస్తున్న కథనాలను అందోల్-జోగిపేట మున్సిపాలిటీ వైస్ ఛైర్మన్ ఆకుల సత్యనారాయణ (చిట్టిబాబు) తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయన స్పందిస్తూ మంత్రి దామోదర రాజనర్సింహపై వస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని కొట్టిపారేశారు.

ఈ సందర్భంగా ఆకుల సత్యనారాయణ మాట్లాడుతూ.. "మా నాయకుడి పైన లేనిపోని వార్తలు ఎవ్వరూ నమ్మరు. ఏదైనా అభివృద్ధి పైన గానీ, సంక్షేమ పథకాల పైన చర్చ పెడితే బావుంటుంది. కానీ, అందోల్ నియోజకవర్గంలో రూ. 2,000 కోట్లకు పైబడి అభివృద్ధి పనులు సాగుతున్నాయి. అది మనందరికీ తెలుసు. పండ్లు ఉన్న చెట్టుకే రాళ్లు పడతాయి. ఆయన సహనం, ఓర్పు, క్రమశిక్షణ చూసి నేర్చుకోవాలి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే గుణం ఉండాలని కాంగ్రెస్ పార్టీ నాయకులకు దామోదర నేర్పించారు. ఇలాంటి ఆరోపణలు రావడం సరికాదు" అని పేర్కొన్నారు.

అలాగే రాజకీయ నాయకుల తీరును తప్పుపడుతూ తీవ్రంగా హెచ్చరించారు. "దయచేసి లేనిదానిని ఉన్నట్టుగా చూపించడం కొంతమందికి వెన్నతో పెట్టిన విద్య కాబట్టి ఇక చాలు మిత్రులారా! బీఫాం ఇచ్చిన నాయకుడి మీదనే బుసలు కొడతారా? ఖబర్దార్! బీఫాం ఇచ్చి రాజకీయంగా నిలబెట్టిన నాయకుడి గౌరవం మరిచి మాట్లాడితే ఎట్లా? దామోదర్ రాజనర్సింహ అవకాశం ఇచ్చి రాజకీయంగా ఎదిగిస్తే… ఇప్పుడు అదే నాయకుడి మీద రాజకీయాలు చేస్తారా?" అంటూ మండిపడ్డారు.

రాజకీయాల్లో ఎదగడం, పదవులు అనుభవించడం సహజమని, కానీ ఎదిగేందుకు బాటలు వేసిన నాయకుడి గౌరవాన్ని ఎప్పటికీ మరిచిపోకూడదని హితవు పలికారు. "గుర్తుంచుకోండి… బీఫాం ఇవ్వడం నాయకుడి గొప్పతనం… గెలిపించుకోవడం ప్రజల గొప్పతనం… ఎదిగాక కృతజ్ఞత మర్చిపోవడం మాత్రం రాజకీయ అహంకారం! ఖబర్దార్! మా నాయకుడి గౌరవం మీద చేయి పెడితే ఊరుకునేది లేదు! దామోదర్ రాజనర్సింహ గారి నాయకత్వాన్ని విమర్శలతో తగ్గించలేరు… ఆయన అభిమానుల ఆత్మగౌరవాన్ని తక్కువ అంచనా వేయలేరు" అని వైస్ ఛైర్మన్ ఆకుల సత్యనారాయణ హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: