Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

బిఆర్ఎస్ నాయకులు జువ్వాడి కృష్ణారావును విమర్శిస్తే సహించేది లేదు

Author
Posted By TELANGANA KERATAM
| 05 Nov 2026, 07:49 AM | 1 | తెలంగాణ
బిఆర్ఎస్ నాయకులు జువ్వాడి కృష్ణారావును విమర్శిస్తే సహించేది లేదు

తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 04 : కోరుట్ల బిఆర్ఎస్ నాయకులు జువ్వాడి కృష్ణారావును విమర్శిస్తే సహించేది లేదని, ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తిరుమల గంగాధర్ హెచ్చరించారు. ఈ సందర్భంగా బుధవారం కోరుట్ల పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... సిద్దిపేటకు చెందిన కేసీఆర్, కేటీఆర్ లు గజ్వేల్, రాజన్న సిరిసిల్ల ఎమ్మెల్యేలుగా, ఉమ్మడి కరీంనగర్ కు చెందిన హరీష్ రావు సిద్దిపేట ఎమ్మెల్యేగా జిల్లాల్లోని వివిధ నియోజకవర్గాల్లో ఎన్నికల్లో పోటీ చేస్తూ, తెలంగాణ మొత్తం తమ జాగీర్ అనుకుంటున్నారని, వారు తమ సొంత నియోజకవర్గాల్లో కాకుండా పక్క నియోజకవర్గాల్లో ఎందుకు పోటీ చేస్తున్నారని కోరుట్ల బిఆర్ఎస్ నాయకులను ప్రశ్నించారు. దివంగత మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు తనయుడు కృష్ణారావు నిరంతరం ప్రజా సేవలో నిమగ్నమై, అవినీతి మచ్చ లేని ప్రజానాయకుడని అన్నారు. నియోజకవర్గంలో మంచితనానికి, నిజాయితీకి మారుపేరుగా నిలిచిన వ్యక్తి కృష్ణారావు అని కొనియాడారు. ప్రజలకు, కార్యకర్తలకు ఏ సమస్య వచ్చినా నేనున్నానని ముందుండే ఆయనను మరొక్కసారి విమర్శిస్తే సహించేది లేదని..ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. ముందు మీ వీకెండ్ ఎమ్మెల్యే మీద మీ కార్యకర్తలకు అవగాహన లేదని, నియోజకవర్గంపై ఎమ్మెల్యేకు అవగాహన లేదని, అలాంటి మీరా.. మా నాయకుడిని విమర్శించేది..ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ షాహిద్, కౌన్సిలర్ లు సౌగ్రాభి, తోట గంగాధర్, రహీమ్, జగిత్యాల జిల్లా మైనారిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు నయీమ్, కోరుట్ల మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు కొంతం రాజం, ఎడ్ల రమేష్, చిటిమెల్లి రంజిత్, ఎంబెరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: