Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైన ప్రణయ్, మనసకు ఘన సన్మానం

Author
Posted By TELANGANA KERATAM
| 05 Nov 2026, 07:59 AM | 4 | తెలంగాణ
రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైన ప్రణయ్, మనసకు ఘన సన్మానం
రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైన ప్రణయ్, మనసకు ఘన సన్మానం
తెలంగాణ కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 4, నవంబర్
నేరడిగుంట గ్రామం: రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికై గ్రామానికి మంచి పేరు తీసుకొచ్చిన విద్యార్థులు ప్రణయ్ మరియు మనసలను నేడు ఘనంగా సన్మానించడం జరిగింది.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, గ్రామంలోని యువత క్రీడా రంగంలో మరింత ముందుకు సాగి ఉన్నత స్థాయిలో ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు. రాష్ట్ర స్థాయి పోటీలలో కూడా ప్రణయ్, మనసలు అత్యుత్తమ ప్రతిభ కనబరచి గ్రామానికి మరింత పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ప్రోత్సహించారు.

అదేవిధంగా, రాష్ట్ర స్థాయి పోటీలలో మంచి ప్రతిభ కనబరిస్తే ఇద్దరు క్రీడాకారులకు తలా రూ.10,000 చొప్పున ప్రోత్సాహక బహుమతిని అందజేస్తానని ప్రకటించారు. గ్రామంలోని ప్రతిభావంతులైన విద్యార్థులు, యువతకు ఎల్లప్పుడూ ప్రోత్సాహం అందిస్తూ వారి అభివృద్ధికి సహకరిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఈశ్వర్ గారు, వార్డు సభ్యులు బోయిని శంకర్ గారు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ సిబ్బంది, గ్రామ పెద్దలు, విద్యార్థులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: