సర్పంచ్ పుప్పాల నరేష్
తెలంగాణ కెరటం బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి నవంబర్ 4:
నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం తిమ్మాపూర్
గ్రామ అభివృద్ధిని కాంక్షిస్తూ, ప్రగతి పథంలో గ్రామాన్ని ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో నేడు తిమ్మాపూర్‌లో ప్రత్యేక ఇంటి పన్ను వసూళ్ల కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ పుప్పాల నరేష్ అధ్యక్షత వహించగా, పంచాయతీ కార్యదర్శి బాస నరేందర్ మరియుగ్రామపంచాయతీ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా సర్పంచ్ పుప్పాల నరేష్ మాట్లాడుతూ.మెరుగైన సమాజ నిర్మాణం, ప్రజల సంక్షేమం మరియు మహాత్మా గాంధీ కలలు కన్న 'గ్రామ స్వరాజ్యం' సాధనే ధ్యేయంగా తమ పాలన సాగుతోందని స్పష్టం చేశారు. ఈ పన్ను వసూళ్ల కార్యక్రమంలో 100 శాతం లక్ష్యాన్ని చేరుకోవడానికి శ్రమిస్తున్న జీపీ (గ్రామపంచాయతీ) సిబ్బంది అందరినీ ఆయన ప్రత్యేకంగా అభినందించారు.అలాగే, గ్రామ అభివృద్ధికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పన్నులు చెల్లిస్తున్న గ్రామస్తుల మంచి మనసును, సహకారాన్ని సర్పంచ్ కొనియాడారు. ఈ కార్యక్రమ సమయంలో గ్రామ ప్రజలను ఆప్యాయంగా పలకరించి, వారి ప్రాథమిక అవసరాలు మరియు ఏవైనా సమస్యలు ఉంటే అడిగి తెలుసుకున్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతుందని,భవిష్యత్తులోనూ ఇలాంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు మరిన్ని నిర్వహిస్తామని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు.



