తెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 4, నవంబర్
*రాహుల్ గాంధీ నీ ప్రధాని చేసేందుకు తెలంగాణ కాంగ్రెస్ ఛాలెంజ్ గా తీసుకుంటాం*
*తెలంగాణ లో 14 ఎంపీ సీట్లు గెలిచి తీరుతాం*
*రాహుల్ గాంధీ ఇంట్లోనే ప్రధాని పదవి పుట్టింది*
*రాహుల్ గాంధీ ప్రధాని అవ్వాలి అనుకుంటే 2004లోనే అయ్యేవారు*
*రాముడి లేరు చెప్పుకుని మూడు సార్లు ప్రధాని అయ్యింది మీ మోడీ*
*రాముడి పేరుతో అధికారం లోకి వచ్చారు కానీ.. ఆయన అడుగు జాడల్లో పని చేయడం లేదు*
*స్వతంత్ర ఉద్యమం లోనే మహాత్మాగాంధీ... రఘుపతి రాఘవ రాజారాం అని రాముడి భజన చేశారు*
*అప్పుడు బీజేపీ పుట్టలేదు.. మోడీ .. అమిత్ షా లు కూడా పుట్టి ఉండరు*
*జగ్గారెడ్డి*
రాహుల్ గాంధీ ప్రధాని అయ్యే అవకాశం లేదని అమిత్ షా మాట్లాడారు.
అమిత్ షా ఒక విషయం మర్చిపోతున్నారు.
నేను చాలా సార్లు చెప్పను రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అవుతారో లేదో తెలీదు
కానీ ప్రధాన మంత్రి పదవే రాహుల్ గాంధీ కుటుంబం లో పుట్టింది.
అమిత్ షా మీరు అధికారం లోకి రాకముందు ఏం జరిగిందో మీ కుటుంబ సభ్యులని అడిగి తెలుసుకోండి.
స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రజలు నేరుగా నెహ్రు నీ ప్రధానిగా ఎన్నుకున్నారు.
మోడీ ప్రధాన మంత్రి అయ్యి 13ఏళ్లు అయింది.
2004 లో సోనియా గాంధీ నేతృత్వం లో యూపీఏ ప్రభుత్వం ఏర్పడింది.
సోనియా, రాహుల్ గాంధీ నీ ప్రధాని కావాలని ఎంపీలు అందరు తీర్మానం చేశారు
కానీ మాకు ప్రధాన మంత్రి పదవి వద్దన్నారు.
మన్మోహన్ సింగ్ నీ ప్రైమ్ మినిస్టర్ చేశారు.
మన్మోహన్ సింగ్ సైతం ప్రైమ్ మిస్టర్ అయ్యాక రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ కావాలని కోరారు
కానీ రాహుల్ గాంధీ తిరస్కరించి మీరే ఉండాలి మీ నేతృత్వం లోనే పని చేస్తామని అన్నారు.
ఉపాధి హామీ పధకం తీసుకొచ్చి దేశంలో పెద్ద ప్రజలను ఆదుకున్నారు.
అమిత్ షా మీరెవ్వరు రాహుల్ ప్రధాని కాలేడని చెప్పడానికి
మీకు చెప్పే హక్కే లేదు..
రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి కావాలనీ కోరుకుంటే ఐపోతారు
దేశ ప్రజలు రాహుల్ నీ ప్రధాని చేస్తారు.
ఈ దేశ ఓటర్లను శాసించే హక్కు మీకు లేదు.
అమిత్ షా కీ ఇదే మా సమాధానం.
అమిత్ షా అహంకారం తో మాట్లాడిన మాటలకి సమాధానం ఇస్తాము.
రానున్న ఎన్నికలో 17 లో 14 ఎంపీ స్థానాలు గెలిచి ఇస్తాము.
తెలంగాణ లో కాంగ్రెస్ కీ బలం ఉంది... బిజేపీ కీ లేదు.
ఛాలెంజ్ గా తీసుకుంటాము రాహుల్ గాంధీ ప్రధాని కావడానికి పని చేస్తాము
శ్రీరాముడి పేరుతో మీరు అధికారం లో ఉన్నారు.
మంచిది కానీ ఆయన అడుగుజాడల్లో మీరు పరిపాలన సాగించడం లేదు.
కేవలం రాజకీయాల కోసం మాత్రమే శ్రీరాముడి పేరు ఉపయోగిస్తున్నారు.
*మహాత్మ గాంధీ రఘుపతి రాఘవ రాజారాం పతీత పావన సీతారామ అని భజన చేసే సమయంలో బీజేపీ పార్టీ యే పుట్టలేదు.*
*బీజేపీ పార్టీ యే కాదు మోడీ అమిత్ షా కుడా పుట్టలేదేమో*
*ప్రజలు సంతోషంగా ఉండాలనే నెహ్రు, గాంధీ కుటుంబం కోరుకున్నది*
సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరుతో ఓట్లు తీసుకునే ప్రయత్నం బీజేపీ చేసింది.
సర్దార్ వల్లభాయ్ పటేల్ నెహ్రు కాబినెట్ లో మంత్రి.
సర్దార్ వల్లభాయ్ పటేల్ పక్క కాంగ్రెస్ పార్టీ.
నెహ్రు డైరెక్షన్ లోనే కదా సర్దార్ వల్లభాయ్ పటేల్ తెలంగాణ ను దేశంలో విలీనం చేయించింది
అరే మా ఇంటి వారిని కుడా మీ ఖాతాలో వేసుకుంటారు.
రాహుల్ గాంధీ నీ ప్రధాని చేస్తాము..
దాని కోసం 17 ఎంపీ స్థానలో 14 స్థానాలు గెలిచేందుకు పని చేస్తాము.



