Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

తెలంగాణ కెరటం ఎఫెక్ట్.. కామారెడ్డి మున్సిపాలిటీ ఆరోపణలపై సమగ్ర విచారణకు కలెక్టర్ ఆదేశం

Author
Posted By TELANGANA KERATAM
| 05 Nov 2026, 12:24 PM | 30 | TELANGANA, తెలంగాణ
తెలంగాణ కెరటం ఎఫెక్ట్.. కామారెడ్డి మున్సిపాలిటీ ఆరోపణలపై సమగ్ర విచారణకు కలెక్టర్ ఆదేశం

తెలంగాణ కెరటం ఎఫెక్ట్.. కామారెడ్డి మున్సిపాలిటీ ఆరోపణలపై సమగ్ర విచారణకు కలెక్టర్ ఆదేశం


కామారెడ్డి మున్సిపాలిటీలో కొందరు కౌన్సిలర్లు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని, మున్సిపల్ పాలనలో పలు అవకతవకలు జరుగుతున్నాయని ఇటీవల "తెలంగాణ కెరటం  పత్రికలో ప్రచురితమైన కథనాలపై జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ స్పందించారు

కామారెడ్డి మున్సిపాలిటీలో కొందరు కౌన్సిలర్లు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని, మున్సిపల్ పాలనలో పలు అవకతవకలు జరుగుతున్నాయని ఇటీవల "దిశ " దిన పత్రికలో ప్రచురితమైన కథనాలపై జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ స్పందించారు. ఈ ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి నిర్దిష్ట గడువులోగా నివేదిక సమర్పించాలని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఎన్.వై. గిరిని ఆదేశించారు. ఈ విచారణలో భాగంగా మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం పరిధిలో చేపట్టిన టెండర్ల ప్రక్రియ, పారిశుద్ధ్య సిబ్బంది నియామకాలు, వారి హాజరు, వేతనాల చెల్లింపులు, సీసీ కెమెరాల ఏర్పాటు పనులు, వాటిలో ప్రజా ప్రతినిధుల కుటుంబ సభ్యుల జోక్యంపై వచ్చిన ఆరోపణలను క్షుణ్ణంగా పరిశీలించనున్నారు.

అదేవిధంగా పట్టణ ప్రణాళిక విభాగం జారీ చేసిన నోటీసులు, వాటిపై తీసుకున్న తదుపరి చర్యలు, మున్సిపల్ కౌన్సిల్ నెలవారీ సమావేశాల నిర్వహణ, గణేష్ నిమజ్జనం ఏర్పాట్ల కోసం కొనుగోలు చేసిన ఇనుప సామాగ్రి వినియోగం, అనంతరం వాటి విక్రయానికి సంబంధించిన వివరాలను పరిశీలించనున్నారు. మున్సిపల్ వాహనాల నెలవారీ ఇంధన వినియోగం, వ్యాపార అనుమతుల జారీ, ఇంటి పన్ను మదింపు ప్రక్రియ తదితర అంశాలపైనా సమగ్రంగా విచారణ జరిపి వాస్తవాలను నిర్ధారించనున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలో ప్రజలకు అందించే సేవల్లో ఎలాంటి అవకతవకలు, అక్రమ వసూళ్లు జరిగినా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

విచారణలో ఆరోపణలు రుజువైతే బాధ్యులైన ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బందిపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మున్సిపల్ సేవల కోసం ఎవరైనా డబ్బులు డిమాండ్ చేసినా, ప్రజలను బెదిరింపులకు గురిచేసినా సంబంధిత ఆధారాలతో ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు. ఫిర్యాదులను అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) కార్యాలయంలో లేదా కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో సమర్పించవచ్చని, ఫిర్యాదుదారుల వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని తెలిపారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: