తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 06 : కోరుట్ల మండలం మాదాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన ప్యాక్స్, ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్యాక్స్ చైర్మన్ గడ్డం ఆదిరెడ్డి, గ్రామ సర్పంచ్ జంగా భూలక్మి - దేవేందర్ లు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..రైతులు పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా విక్రయించుకొని, మద్దతు ధర పొందాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రం నిర్వాహకులు తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వోదెల రామకృష్ణ, మాజీ సర్పంచ్, మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు దారిశెట్టి రాజేష్, సొసైటీ కార్యదర్శి మహేందర్, పంచాయతీ కార్యదర్శి అపర్ణ, సహకార సంఘం డైరెక్టర్లు, పాక్స్, ఐకెపి సిబ్బంది పాల్గొన్నారు.
ప్యాక్స్, ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం
ప్యాక్స్, ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం
మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి
తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags:



