- విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం
తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 06 : కోరుట్లలోని ప్రభుత్వ బీసీ బాలుర కళాశాల వసతి గృహాన్ని శుక్రవారం ఎంపీడీవో వోదెల రామకృష్ణ శుక్రవారం తనిఖీ చేశారు..ఈ సందర్భంగా విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాణ్యత, ప్రభుత్వం నిర్దేశించిన కామన్ డైట్ మెనూ అమలు, వంటగది, భోజనశాల పరిశుభ్రత, తాగునీటి నాణ్యత, ఆహార నిల్వ విధానాలను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి ఎంపీడీవో భోజనం చేశారు. భోజనం నాణ్యత, రుచి, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై వారిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన, పౌష్టికాహారం అందించాలని, వసతి గృహంలో పరిశుభ్రత, ఆహార భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. ఈ తనిఖీలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీపాద వేణు పాల్గొన్నారు.



