అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు కాంగ్రెస్ నాయకుల వినతి
బుగ్గారం: బుగ్గారం మండల అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని కోరుతూ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నగునూరి నర్సగౌడ్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా బుగ్గారం మండల ప్రజల చిరకాల కోరిక అయిన బుగ్గారం ఎక్స్ రోడ్డు నుంచి డబుల్ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. అదేవిధంగా విద్యార్థినుల విద్యాభివృద్ధికి ఎంతో అవసరమైన కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (KGBV) శాశ్వత భవన నిర్మాణానికి నిధులు కేటాయించాలని, భక్తుల ఆకాంక్ష మేరకు శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి ప్రభుత్వ సహకారం అందించాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు.
వినతిపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సానుకూలంగా స్పందిస్తూ, సంబంధిత అధికారులతో మాట్లాడి నిధుల మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు మండల కాంగ్రెస్ అధ్యక్షులు నగునూరి నర్సగౌడ్ తెలిపారు.
బుగ్గారం మండల అభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని, ప్రజల అవసరాలన



