- సదాశివపేటలో సురక్ష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఘన ప్రారంభోత్సవం,,,,,,,,,,,,
ముఖ్య అతిథిగా పాల్గొని ఆసుపత్రిని ప్రారంభించిన మాజీ టి జి ఐ ఐ సి చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి
సదాశివపేట: పట్టణంలోని ప్రధాన రహదారిపై నూతనంగా ఏర్పాటు చేసిన సురక్ష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ను మాజీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె ఆసుపత్రి ప్రారంభోత్సవంలో రిబ్బన్ కట్ చేసి వైద్య సేవలను ప్రారంభించారు.
డాక్టర్లు శిరీష, రాజ్ కుమార్ పట్లోళ్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ఆసుపత్రిలో ప్రత్యేకంగా ఈ ఎన్ టి (చెవి, ముక్కు, గొంతు), డయాబెటిక్ కేర్‌తో పాటు అన్ని రకాల వైద్య సేవలను అత్యాధునిక వైద్య సదుపాయాలతో అందించనున్నట్లు వైద్యులు తెలిపారు.
ఈ సందర్భంగా ఆసుపత్రి నిర్వాహకులు మాట్లాడుతూ సదాశివపేట పట్టణ ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజలందరూ సురక్ష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించే వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మునిపల్లి సత్యనారాయణ, వైస్ చైర్మన్ చిరు, సర్పంచ్ మధు, మిల్గిరిపేట సర్పంచ్ షాబుద్దీన్, దుర్గారెడ్డి, కుమార్, పట్టణ ప్రముఖులు, శ్రేయోభిలాషులు, ఆసుపత్రి వైద్య బృందం, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



