Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

జోగిపేటను ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుకుందాం – ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు

Author
Posted By TELANGANA KERATAM
| 08 Nov 2026, 07:49 AM | 36 | Politics, తెలంగాణ
జోగిపేటను ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుకుందాం – ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు
జోగిపేటను ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుకుందాం – ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు
 తెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 7, నవంబర్
ఆందోల్–జోగిపేట మున్సిపల్ చైర్మన్ ఎస్. కృష్ణారెడ్డి
జోగిపేట: చెడుపై మంచి, చీకటిపై వెలుగు సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే దీపావళి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని ఆందోల్–జోగిపేట మున్సిపల్ చైర్మన్ ఎస్. కృష్ణారెడ్డి ఆకాంక్షించారు. ఈ సందర్భంగా జోగిపేట పట్టణ ప్రజలకు, వారి కుటుంబ సభ్యులకు హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ పర్వదినం ప్రతి కుటుంబంలో ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. జోగిపేట పట్టణాన్ని పరిశుభ్రంగా, సుందరంగా, ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రజలందరూ సహకరించాలని పిలుపునిచ్చారు.
ప్రజలు నీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించాలని, తమ ఇళ్లతో పాటు పరిసర ప్రాంతాలు, వీధులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పర్యావరణానికి హాని కలగకుండా, కాలుష్య రహిత వాతావరణంలో సురక్షితంగా దీపావళి వేడుకలు జరుపుకోవాలని కోరారు.
పట్టణ అభివృద్ధి అనేది కేవలం పాలకవర్గం బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడి భాగస్వామ్యం అవసరమని పేర్కొన్నారు. ప్రజల సహకారం, ఐక్యత, సామాజిక బాధ్యతతో జోగిపేటను పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుకుందామని మున్సిపల్ చైర్మన్ ఎస్. కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: