Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

దుకాణం బాగా నడుపు.. అమ్మను మంచిగా చూసుకో

Author
Posted By TELANGANA KERATAM
| 08 Nov 2026, 07:45 AM | 9 | Politics, తెలంగాణ
దుకాణం బాగా నడుపు.. అమ్మను మంచిగా చూసుకో
దుకాణం బాగా నడుపు.. అమ్మను మంచిగా చూసుకో

తెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 7, నవంబర్
*అమ్మని పట్టించుకోవడం లేదని నాకు తెలిస్తే.. చెంప పగులగొడుతా*

*చిరు వ్యాపారిని సుతిమెత్తగా హెచ్చరించిన జగ్గారెడ్డి*

*సంగారెడ్డి గంజ్ మైదాన్ వద్ద కల్లు కాంపౌండ్ లో మిర్చీ దుకాణం నిర్వహిస్తున్న వ్యక్తితో జగ్గారెడ్డి ముచ్చట*

*దుకాణంలో సామాన్లు తెచ్చుకోవడానికి రూ. 10వేల సాయం*

సంగారెడ్డి గంజ్ మైదాన్ ప్రాంతాన్ని శనివారం జగ్గారెడ్డి పరిశీలించారు. తన కుమారుడి వివాహ వేడుక ఏర్పాట్లకు సంబంధించి... గంజ్ మైదాన్ లో చేయాల్సిన ఏర్పాట్ల గురించి చర్చించారు. ఈ సందర్భంగా పక్కనే ఉన్న కళ్ళు కాంపౌండ్ లోకి వెళ్లారు. అక్కడ మిర్చీలు అమ్ముతున్న వ్యక్తితో జగ్గారెడ్డి సరదాగా ముచ్చటించారు. " గతంలో సైకిల్ పుల్లలకు మాంసం పెట్టి, సీకులు కాల్చి ఇచ్చేవారు కదా? ఇప్పుడు మటన్ సీకులు తయారు చేయడం లేదా? "అంటూ జగ్గారెడ్డి అడిగారు. ఇప్పుడు సీకులు తయారు చేయడం లేదని, మిర్చీలు అమ్ముతున్నానని ఆ చిరు వ్యాపారి చెప్పారు.

*అమ్మ ఎలా వుంది అని అడిగిన జగ్గారెడ్డి*

అమ్మ ఎలా ఉంది.. అంటూ ఆ చిరు వ్యాపారిని జగ్గారెడ్డి అడిగారు. దుకాణం మంచిగా అభివృద్ధి చేసుకోవడానికి కూడా సాయం చేస్తానన్నారు. ఇంతలో పక్కనున్న వ్యక్తి ఒకరు.. అమ్మను సరిగా చూసుకోమని అతడికి చెప్పండి అంటూ జగ్గారెడ్డికి సూచించారు.
 ఈ విషయమై స్పందించిన జగ్గారెడ్డి... *"అమ్మను మంచిగా చూసుకోవడానికి ఏం రోగం రా మీకు. ఇదిగో ఈ రూ. 10వేలు తీసుకో. దుకాణంలోకి కావాల్సిన వస్తువులు తెచ్చుకో. దుకాణం బాగా నడుపు. అమ్మను మంచిగా చూసుకో. అమ్మని పట్టించుకోవడంలేదని నాకు తెలిస్తే చెంప పగుల గొడుతా " అంటూ సుతిమెత్తగా జగ్గారెడ్డి హెచ్చరించారు.*

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: