Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

కేకే ఫైర్ వర్క్స్ వద్ద ట్రాఫిక్ ఇబ్బందులు.. ప్రమాదాలకు పొంచి ఉన్న ముప్పు

Author
Posted By TELANGANA KERATAM
| 08 Nov 2026, 12:19 PM | 20 | Crime, తెలంగాణ
కేకే ఫైర్ వర్క్స్ వద్ద ట్రాఫిక్ ఇబ్బందులు..  ప్రమాదాలకు పొంచి ఉన్న ముప్పు
కేకే ఫైర్ వర్క్స్ వద్ద ట్రాఫిక్ ఇబ్బందులు.. 
ప్రమాదాలకు పొంచి ఉన్న ముప్పు!....
తెలంగాణ కెరటం మంచిర్యాల జిల్లా ప్రతినిధి రాం వేణు...
మంచిర్యాల..
మందమర్రి మండలం బొక్కలగుట్ట–పులిమడుగు సమీపంలోని కేకే ఫైర్ వర్క్స్ రహదారిపై వాహనాలు కిటకిటలాడుతున్నాయి. రోడ్డుపై వాహనాలు నిలిపివేయడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. పిల్లలు అకస్మాత్తుగా రోడ్డుపైకి వస్తుండటంతో ఇప్పటికే రెండు ప్రమాదాలు తృటిలో తప్పినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వరుస రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న తరుణంలో దుకాణం యజమాని తగిన జాగ్రత్తలు తీసుకోకుండా కేవలం అతని వ్యాపారం చూసుకోవడం ఎంతైనా ఆలోచించాల్సిన విషయం. అసలు నేషనల్ హైవే ను ఆనుకొని ఉన్న ఈ వ్యాపరికి పర్మిషన్ ఎలా ఇచ్చారని మేధావులు ప్రశ్నిస్తున్నారు. గతంలో ఇక్కడ ఆక్సిడెంట్ జరిగిన సంఘటనలు ఉన్నాయి. ఇప్పుడు ఏదైనా జరగరానిది జరిగితే భాద్యత ఎవరిది అనే సందేహం వస్తుంది. కాబట్టి ప్రాణాపాయం జరగకముందే పోలీసు అధికారులు స్పందించి, రోడ్డుపై నిలిపి ఉంచిన వాహనాలను క్రమబద్ధీకరించి, ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: