Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ముగ్గురు చిన్నారులతో తల్లి అదృశ్యం!

Author
Posted By TELANGANA KERATAM
| 08 Nov 2026, 07:58 AM | 10 | Crime, తెలంగాణ
ముగ్గురు చిన్నారులతో తల్లి అదృశ్యం!
ముగ్గురు చిన్నారులతో తల్లి అదృశ్యం!

*కొండాపూర్‌లో కలకలం.. ఆచూకీ కోసం పోలీసుల గాలింపు*

(తెలంగాణ కెరటం) ఘట్‌కేసర్ ప్రతినిధి /నవంబర్ 7: ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొండాపూర్ గ్రామానికి చెందిన ఓ మహిళ తన ముగ్గురు చిన్నారులతో కలిసి అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. బాధితురాలి తల్లి బొంత సారిత (46) ఫిర్యాదు మేరకు ఘట్‌కేసర్ పోలీసులు మహిళ అదృశ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.వివరాల్లోకి వెళితే.. మమత (26)కు సుమారు ఎనిమిదేళ్ల క్రితం కామారెడ్డికి చెందిన కుంచపు పోచయ్యతో వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే ఐదు నెలల క్రితం భర్తతో కుటుంబ విభేదాలు తలెత్తడంతో మమత తన ముగ్గురు పిల్లలతో కలిసి పుట్టింటికి చేరుకుంది. అనంతరం తల్లి ఏర్పాటు చేసిన అద్దె ఇంట్లో ఉంటూ, వివిధ ఇళ్లలో పనులు చేసుకుంటూ పిల్లలను పోషించుకుంటోంది.ఈ క్రమంలో నవంబర్ 5వ తేదీ ఉదయం మమత ఇంటి పనులకు వెళ్లింది. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఆమె వదిన రాజేశ్వరి ఇంటికి వెళ్లి చూడగా మమతతో పాటు ముగ్గురు పిల్లలు కనిపించలేదు. దీంతో కుటుంబ సభ్యులు బంధువులు, స్నేహితులు, పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా గాలించినప్పటికీ వారి ఆచూకీ లభించలేదు.మమత నివాసముంటున్న గదిని పరిశీలించగా, తాను పిల్లలతో కలిసి వెళ్లిపోతున్నానని, పిల్లలను చదివించి చూసుకుంటానని, తన కోసం వెతకవద్దని రాసిన లేఖ లభించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. అదృశ్యమైన వారి వివరాలు:
1.మమత – 26 సంవత్సరాలు.
2.కృప శైత్య – 6 సంవత్సరాలు.
3.జోహన్ వెస్లీ – 4 సంవత్సరాలు.
4.జోసెఫ్ – 3 సంవత్సరాలు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఘట్‌కేసర్ పోలీసులు మహిళతో పాటు ముగ్గురు చిన్నారుల ఆచూకీ కోసం దర్యాప్తు చేపట్టారు.అదృశ్యమైన మమతతో పాటు ముగ్గురు చిన్నారుల ఆచూకీ ఎవరికైనా తెలిసినట్లయితే వెంటనే ఘట్‌కేసర్ పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించాల్సిన ఫోన్ నంబర్: 8712662705.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: