కే.రవి ఆసుపత్రి బ్రాంచ్ ఏఐటీయూసీ అధ్యక్షులు.
మద్దూరు ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రం సూపరిండెంట్ డాక్టర్ పావని కి ఆందోళన నోటీసులు అందజేసిన కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులు.
తెలంగాణ కెరటం కొడంగల్ నియోజకవర్గం ప్రజా ప్రతినిధి నవంబర్ 9
మద్దూర్ మండల ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్టు పారిశుద్ధ్య సెక్యూరిటీ పేషంట్ కేర్ సూపర్వైజర్ కార్మికులకు కనీస వేతనం 26 వేలకు పెంచాలని డిమాండ్ చేస్తూ ఈనెల 12 నుంచి రాష్ట్రవ్యాప్త ఆందోళనకు దిగుతున్నట్లు తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) బ్రాంచ్ అధ్యక్షులు కే.రవి తెలిపారు. కాలం చెల్లిన ప్రస్తుత ఏజెన్సీలను రద్దు చేయాలని కనీస వేతనం 26 వేలకు పెంచాలని తదితర కార్మికుల డిమాండ్ల సాధనకై తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ)ఆధ్వర్యంలో ఈ నెల 12 నుంచి రాష్ట్రవ్యాప్తంగా జరిగే ఆందోళన సమ్మె నోటీసును సోమవారం మద్దూరు సామాజిక ఆరోగ్య కేంద్రం సూపరిండెంట్ డాక్టర్ పావని కి కాంట్రాక్టు పారిశుద్ధ్య సెక్యూరిటీ పేషెంట్ కేర్ కార్మికులు అందజేశారు.
ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ:- ప్రభుత్వాసుపత్రులలో కాంట్రాక్టు పారిశుద్ధ్య సెక్యూరిటీ పేషెంట్ కేర్ కార్మికులు చాలీచాలని జీతాలతో వెట్టిచాకిరికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఐ హెచ్ ఎఫ్ ఎం ఎస్ టెండర్ విధానంతో ఎంపికైన ఏజెన్సీలు పారిశుద్ధ్య సెక్యూరిటీ పేషంట్ కేర్ సూపర్వైజర్ విభాగాల నిర్వహణ కొనసాగిస్తున్నాయని అయితే వాటి కాలపరిమితి మూడు సంవత్సరాలకే ఉంటుందని ప్రస్తుత ఏజెన్సీలు కాల పరిమితి ముగిసి ఏడాదినాల దాటిపోయిందని దాదాపు 5 సంవత్సరాలుగా పాత ఏజెన్సీలు కొనసాగుతున్నాయని అన్నారు. ప్రతి మూడేళ్లకు ఒకసారి నూతన టెండర్లతోపాటు ఆసుపత్రి కార్మికులకు జీతాలు పెరుగుతాయని కానీ పాత ఏజెన్సీలకు అనుమతులు పెంచుతూ పోవడం వల్ల కార్మికులు తీవ్రమైన ఆర్థిక నష్టానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మానవత దృక్పథంతో తక్షణమే ప్రభుత్వ ఆసుపత్రి కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనం 26 వేలకు పెంచుతూ పండగ జాతీయ ఆర్థిక సెలవులు మంజూరు చేయాలని ప్రభుత్వ ఉద్యోగులుగా మాదిరిగా ఒకటో తారీఖు నాడే కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు అందే విధంగా, కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరించాలని, కార్మికుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఆస్పత్రి కార్మికులు దేవమ్మ, లలిత, సకినా, రేణుక, రవికుమార్, భారతమ్మ తదితరులు పాల్గొన్నారు...



