గ్రామ పంచాయతీ వర్కర్ కుటుంబానికి ఆర్థిక సహాయం
తెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 10, నవంబర్
నేడు మన గ్రామ పంచాయతీ వర్కర్ పెద్దగొల్ల మల్లేశం తల్లి యాదమ్మ మృతి చెందడం పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ, వారి కుటుంబ సభ్యులకు గ్రామ పంచాయతీ తరఫున రూ.5,000/- ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా మృతురాలి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఈ క్లిష్ట సమయంలో గ్రామ పంచాయతీ అండగా ఉంటుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఈశ్వర్, వార్డు సభ్యులు బోయిని శంకర్, తుకాపురం పూజిత నవీన్, ఒగ్గు మల్లేశం, ఒగ్గు దేవరాజు, గున్నాల సంగమేశ్వర్ తదితరులు, గ్రామస్థులు పాల్గొన్నారు.



