Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ‘108’ సిబ్బందికి ఘన సత్కారం

Author
Posted By TELANGANA KERATAM
| 10 Nov 2026, 10:09 PM | 2 | Politics, తెలంగాణ
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ‘108’ సిబ్బందికి ఘన సత్కారం
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ‘108’ సిబ్బందికి ఘన సత్కారం

తెలంగాణ కెరటం బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి నవంబర్ 10:


నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిస్వార్థంగా సేవలందిస్తూ, ఆపద సమయంలో ఎంతోమంది ప్రాణాలను కాపాడుతున్న 108 అత్యవసర వైద్య సేవల సిబ్బందిని మంగళవారం ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా క్లబ్ ప్రతినిధులు స్థానిక 108 సిబ్బంది ఈఎంటీలు కొత్తపల్లి సాగర్, సుంకరి విజయ్ కుమార్, పైలట్ తలారి రమేష్ లకుశాలువాలుకప్పి,మెమొంటోలు,ప్రశంసాపత్రాలుఅందజేసిపూలమాలలతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షుడు తెడ్డు రమేష్ మాట్లాడుతూ.. రాత్రింబవళ్లు అనే తేడా లేకుండా, ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాధితులకు తక్షణ వైద్య సేవలు అందిస్తూ, సకాలంలో ఆసుపత్రులకు చేర్చి ప్రాణాలు కాపాడటంలో 108 సిబ్బంది చేస్తున్న సేవలు వెలకట్టలేనివనికొనియాడారు.ప్రజల ప్రాణాలను కాపాడటమే లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్న 108 ఈఎంటీలు, పైలట్ల సేవలను గుర్తించి గౌరవించడం సమాజబాధ్యతఅనిపేర్కొన్నారుఇలాంటి సత్కారాలు సిబ్బందిలో మరింత సేవాభావాన్ని, ఉత్సాహాన్ని నింపుతాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో  లయన్స్ క్లబ్ జిల్లా ఛైర్పర్సన్ లుక్కా గంగాధర్,కమ్మర్‌పల్లి లయన్స్ క్లబ్ కమ్మర్ పల్లి  ఉపాధ్యక్షుడు సున్నం మోహన్,మార్కెట్ కమిటీ తాజా మాజీ అధ్యక్షుడు పాలేపు నర్సయ్య,కార్యవర్గ సభ్యులు బద్దం రాజశేఖర్, చింత ప్రదీప్,పిప్పేరా అనిల్, సూరంగి చంద్రశేఖర్,చిలివేరి పవన్, హెచ్ఎం కనక గంగాధర్,కొమ్ముల శ్రీనివాస్, సభ్యులతో పాటు 108 ఈఎంటీలు కొత్తపల్లి సాగర్, సుంకరి విజయ్ కుమార్, పైలట్ తలారి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: