దుబ్బాక ప్రతినిధి,అక్బర్ పేట భూంపల్లి, నవంబర్ 11, తెలంగాణ కెరటం:
అక్బర్ పేట భూంపల్లి ఎనగుర్తి గ్రామ ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని శ్రీశ్రీశ్రీ సద్గురు స్వామి సమర్థ గురువు అందించిన సీసీ కెమెరాలను బుధవారం రోజున అక్బర్‌పేట–భూంపల్లి ఎస్సై రాజశేఖర్ , ఎనగుర్తి గ్రామ సర్పంచ్ పోషిగారి ప్రేమలత ప్రభాకర్ ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది.ఈ కార్యక్రమం లో ఉపసర్పంచ్ రజనీకాంత్ మరియు వార్డు సభ్యులు పాల్గొన్నారు.
గ్రామంలో నేరాల నియంత్రణకు, ప్రజల భద్రతకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడనున్నాయి.
గ్రామ అభివృద్ధి, ప్రజల భద్రత కోసం సీసీ కెమెరాలను అందించిన శ్రీశ్రీశ్రీ స్వామి సమర్థ గురువుకు ఎనగుర్తి గ్రామ ప్రజలందరి తరఫున హృదయపూర్వక ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అన్నారు.



