Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

నిబంధనలు పాటించని ప్రైవేట్ ఆసుపత్రులపై చర్యలు తీసుకుంటాం

Author
Posted By TELANGANA KERATAM
| 14 Nov 2026, 06:01 AM | 5 | Politics, తెలంగాణ
నిబంధనలు పాటించని ప్రైవేట్ ఆసుపత్రులపై చర్యలు తీసుకుంటాం
  • నిబంధనలు పాటించని ప్రైవేట్ ఆసుపత్రులపై చర్యలు తీసుకుంటాం

జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ ప్రసన్నాంబ


తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 13 : ప్రైవేట్ ఆసుపత్రులు క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం–2010 ప్రకారం తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. నిబంధనలు పాటించని ఆసుపత్రులపై చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ ఎన్.ప్రసన్నాంబ తెలిపారు. గురువారం జిల్లా అదనపు కలెక్టర్ ఎన్.ప్రసన్నాంబ అధ్యక్షతన జిల్లా రిజిస్ట్రేషన్ అథారిటీ సమావేశం అదనపు కలెక్టర్ ఛాంబర్‌లో నిర్వహించారు. తెలంగాణ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ (రిజిస్ట్రేషన్ అండ్ రెగ్యులేషన్) నిబంధనలు–2022 ప్రకారం, క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం–2010 అమలుపై ఈ సమావేశంలో సమీక్షించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ ఎన్.ప్రసన్నాంబ మాట్లాడుతూ,. జిల్లాలోని అన్ని ప్రైవేట్ ఆసుపత్రులు క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం–2010 ప్రకారం తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. రిజిస్ట్రేషన్ సమయంలో నమోదు చేసిన వైద్యులు, పారామెడికల్ సిబ్బంది మాత్రమే ఆయా ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందించాలని స్పష్టం చేశారు. సిబ్బంది ఎవరైనా విధుల నుంచి వెళ్లిపోయినా, కొత్తగా వైద్యులు లేదా సిబ్బంది చేరినా సంబంధిత వివరాలను తప్పనిసరిగా రిజిస్ట్రేషన్‌లో అప్‌డేట్ చేయించుకోవాలని ఆదేశించారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో సాధారణ వైద్యం, శస్త్రచికిత్సలు, ప్రసవాలు తదితర వైద్య సేవలకు వసూలు చేసే ఫీజుల వివరాలను ప్రజలకు కనిపించే విధంగా స్పష్టమైన బోర్డులపై ప్రదర్శించాలని సూచించారు. వైద్యం కోసం వచ్చే నిరుపేదలకు ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు మానవతా దృక్పథంతో తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందించాలని కోరారు. ఆసుపత్రుల్లో బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ పకడ్బందీగా చేపట్టడంతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జి.సుజాత మాట్లాడుతూ.. జిల్లాలో క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం అమలవుతున్న తీరును, నిబంధనలు పాటించని ఆసుపత్రులపై ఇప్పటివరకు తీసుకున్న చర్యలను సమావేశానికి వివరించారు. ఈ సమావేశంలో ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ జి.శశికాంత్ రెడ్డి, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ ఎం.శ్రీనివాస్, ఇన్‌చార్జి డెమో ఏనుగంటి రాజేశం, హెల్త్ ఎడ్యుకేటర్ రవీందర్ రాథోడ్, జూనియర్ అసిస్టెంట్ వి.సాగర్ తదితరులు పాల్గొన్నారు.
మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: