నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం తీవ్ర కరువులో కొట్టుమిట్టాడుతోందని, కరువులో ఉన్న రైతాంగాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని సీపీఐ అచ్చంపేట నియోజకవర్గ ఇంచార్జి పి.గోపాల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమస్యల పరిష్కారం కోసం నవంబర్ 16న తలపెట్టిన నాగర్ కర్నూల్ చలో - కలెక్టర్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
నాగర్కర్నూల్ జిల్లాలోనే అత్యంత వెనుకబడిన నియోజకవర్గం అచ్చంపేట అని, ఇక్కడి ప్రజలు తాగునీరు, సాగునీరు లేక, ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరించిందని, అందుకే ప్రజా సమస్యలపై కలెక్టరేట్ ను ముట్టడించాల్సి వస్తోందని తెలిపారు.
ప్రధాన డిమాండ్లపై అయినాతాగునీటి సమస్య పరిష్కారం: నియోజకవర్గంలోని అనేక గ్రామాలు, ముఖ్యంగా అమ్రాబాద్, లింగాల మండలాల్లోని చెంచు పెంటాలు, లంబాడీ తండాల్లో మంచినీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. బోర్లు ఎండిపోయాయి, మిషన్ భగీరథ నీళ్లు సరిగా రావడం లేదు. వెంటనే తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలి.
నెలకు రూ.25 వేల ఆర్థిక సహాయం: కరువు కారణంగా వ్యవసాయ పనులు లేక, ఉపాధి హామీ పనులు లేక పేద కుటుంబాలు పస్తులు ఉంటున్నాయి. ప్రతి పేద కుటుంబాన్ని ఆదుకునేందుకు నెలకు రూ.25 వేల ఆర్థిక సహాయం అందించాలి.
ఫారెస్ట్ భూములకు పట్టాలు: తరతరాలుగా అటవీ భూములను సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న గిరిజన, పేద రైతులకు ఇప్పటివరకు పట్టాలు ఇవ్వలేదు. వెంటనే వారికి హక్కు పత్రాలు ఇచ్చి, రైతు భరోసా, రైతు బీమా వర్తింపజేయాలి.
అచ్చంపేటకు సాగునీరు: నియోజకవర్గంలోని చెరువులు, కుంటలు నింపేందుకు శ్రీశైలం బ్యాక్ వాటర్ ద్వారా లేదా కల్వకుర్తి లిఫ్ట్ ద్వారా సాగునీరు అందించాలని . లేకుంటే రైతాంగం పూర్తిగా నాశనమవుతుంది.
యువతకు ఉపాధి: నియోజకవర్గంలో నిరుద్యోగం తీవ్రంగా ఉందని . చదువుకున్న యువతీ, యువకులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని . ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని , స్థానిక పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలి.
ఎన్నికల హామీల అమలు: రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు రైతు రుణమాఫీ, మహిళలకు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని .
కాగితపు పరిశ్రమ ఏర్పాటు: అచ్చంపేటలో గతంలో ఉన్న కాగితపు పరిశ్రమను తిరిగి పునరుద్ధరించాలి లేదా కొత్త పరిశ్రమను ఏర్పాటు చేయడం ద్వారా స్థానికంగా వేలాది మందికి ఉపాధి కల్పించాలని, మూగ జీవాలకు పశుగ్రాసం అందించాలని కరువు కారణంగా పశుగ్రాసం కొరత తీవ్రంగా ఉంది. పశువులను కాపాడేందుకు ప్రభుత్వం ఉచితంగా పశుగ్రాసం, తాగునీటి తొట్టెలను ఏర్పాటు చేయాలి.
ఈ 8 డిమాండ్ల సాధన కోసం నవంబర్ 16న జరిగే కలెక్టర్ ముట్టడిలో అచ్చంపేట నియోజకవర్గంలోని ఏడు మండలాల నుండి రైతులు, వ్యవసాయ కూలీలు, చెంచులు, లంబాడాలు, మహిళలు, యువత పెద్ద ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని పి.గోపాల్ చేశారు.



