తేదీ: 14 నవంబర్ తెలంగాణ కెరటం
సూర్యాపేట జిల్లా
మునగాల ఎస్సీ బాలికల వసతి గృహాన్ని సందర్శించిన బీసీ యువజన నాయకుడు
మునగాల మండల కేంద్రంలోని ఎస్సీ బాలికల వసతి గృహాన్ని బీసీ యువజన నాయకుడు శ్రీ సుంకరి నాగయ్య గారు సందర్శించారు.
ఈ సందర్భంగా వసతి గృహ సంక్షేమ అధికారి శ్రీమతి s.నీలమ్మ ని కలిసి, విద్యార్థినులతో మాట్లాడి వారికి అందుతున్న వసతి సౌకర్యాల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థినులు వసతి గృహంలో అన్ని సౌకర్యాలు బాగున్నాయని, తమకు ఎలాంటి ఇబ్బందులు లేవని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో వసతి గృహ సిబ్బంది శ్రీమతి మరియమ్మ, శ్రీమతి . రేణుక, శ్రీమతి నిర్మల పాల్గొన్నారు



