Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ఈ నెల 15న లక్షలాదిమంది మంది రైతులతో నల్గొండలో జరిగే మహా ప్రదర్శనలో పాల్గొనండి

Author
Posted By TELANGANA KERATAM
| 14 Nov 2026, 07:01 PM | 5 | Politics, TELANGANA, తెలంగాణ
ఈ నెల 15న లక్షలాదిమంది మంది రైతులతో నల్గొండలో జరిగే మహా ప్రదర్శనలో పాల్గొనండి
ఈ నెల 15న లక్షలాదిమంది మంది రైతులతో నల్గొండలో జరిగే మహా ప్రదర్శనలో పాల్గొనండి

రైతు సంఘం 36వ అఖిలభారత మహాసభలను జయప్రదం చేయండి

CITU జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ పిలుపు

నల్గొండ జిల్లాలో జరిగే 36వ అఖిల భారత కిసాన్ మహాసభలను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ రైతులు,కార్మికులకు పిలుపునిచ్చారు. 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆల్ ఇండియా కిసాన్ సభ 36వ జాతీయ మహాసభలు తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండలో జరుగుతున్నాయని తెలిపారు.మొదటి రోజు అనగా ఆదివారం నల్లగొండ పట్టణంలో లక్ష మందితో భారీ బహిరంగ సభ ఉంటుందని ఈ బహిరంగ సభకు ధరూరు మండలంలోని రైతులు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. గత 12 సంవత్సరాల కాలంలో దేశంలో వ్యవసాయ రంగంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అనుసరిస్తున్న నిర్లక్ష్య విధానాల వల్ల వ్యవసాయ రంగం పూర్తిగా ప్రైవేటీకరణ అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో 70 శాతానికి పైగా వ్యవసాయ రంగంపై ఆధారపడిన జనాభాను కాదని, దేశంలోని బడా కార్పొరేట్ శక్తులకు వ్యవసాయ రంగాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. మొదటిరోజు బహిరంగ సభ మిగతా మూడు రోజులపాటు ప్రతివిధ సభ ఉంటుందని ఈ సభలో దేశంలో వ్యవసాయ రంగం వ్యవసాయ రంగంపై ప్రభుత్వాల విధానాలు, రైతులు ఎదుర్కొంటున్న సవాళ్లు, ప్రత్యామ్నాయ విధానాలపై సమగ్ర చర్చ ఉంటుందని తెలిపారు. మహాసభలలో భవిష్యత్ కర్తవ్యాలను రూపొందించుకొని పోరాటాలకు రూపకల్పన చేస్తామన్నారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: