Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

నంబర్ ప్లేట్లు లేని ద్వి వాహనాలపై పోలీసుల కొరడా.

Author
Posted By TELANGANA KERATAM
| 14 Nov 2026, 08:49 PM | 4 | Crime, తెలంగాణ
నంబర్ ప్లేట్లు లేని ద్వి వాహనాలపై పోలీసుల కొరడా.
నంబర్ ప్లేట్లు లేని ద్వి వాహనాలపై పోలీసుల కొరడా..!

50 ద్విచక్ర వాహనాల సీజ్..

తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 14 : నంబర్ ప్లేట్లు లేని వాహనాలపై కోరుట్ల పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. కోరుట్ల పట్టణంలోని వివిధ కూడళ్లలో వద్ద శనివారం సాయంత్రం సీఐ కొమ్ము తిరుపతి ఆధ్వర్యంలో పోలీసులు ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నంబర్ ప్లేట్లు లేని 50 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా సీఐ కొమ్ము తిరుపతి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ మోటార్ వాహనాల చట్టం ప్రకారం వాహనాలకు తప్పనిసరిగా నెంబర్ ప్లేట్లను కలిగి ఉండాలని, ప్రామాణిక నంబర్ ప్లేట్లను మాత్రమే వాడాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే, కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. తనిఖీల్లో ఎస్సైలు శ్యామ్ రాజ్, గంగాధర్, రవి కిరణ్ తదితర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: