Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

కలిసి పని చేద్దాం.. డిమాండ్లు సాధించుకుందాం

Author
Posted By D RAMAKRISHNA
| 15 Nov 2026, 09:06 AM | 9 | ఖమ్మం, తెలంగాణ
కలిసి పని చేద్దాం..  డిమాండ్లు సాధించుకుందాం
  • తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల సోమయ్య 
ఖమ్మం, నవంబర్ 14 (తెలంగాణ కెరటం): ఉద్యమకారుల హక్కులను, డిమాండ్లను సాధించుకునేందుకు కలిసి పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల సోమయ్య అన్నారు. ఆయన ఇచ్చిన పిలుపుమేరకు సీనియర్ తెలంగాణ ఉద్యమ నాయకుడు క్రిష్టఫర్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న తెలంగాణ మలిదశ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర కమిటీని తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక లో విలీనం చేశారు. అదేవిధంగా సూర్యపేట జిల్లాకు చెందిన సీనియర్ ఉద్యమ నాయకుడు గడ్డం యాదగిరి తన అనుచరులతో కలిసి తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదికలో చేరారు. ఈ సందర్భంగా సోమయ్య మాట్లాడుతూ... ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం అహర్నిశలు పాటుపడిన ప్రతి ఒక్కరికి తెలంగాణ ఫలాలు దక్కాలని, ఉద్యమకారులను విస్మరిస్తున్న ప్రభుత్వాలను ప్రశ్నించేందుకు తమ న్యాయమైన డిమాండ్లను సాధించుకునేందుకు ప్రతి ఉద్యమకారుడు కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని బత్తుల పిలుపునిచ్చారు. తెలంగాణ అమరవీరుల తల్లిదండ్రులకు అండగా నిలవాల్సిన గత ప్రస్తుత ప్రభుత్వాలు వారిని గాలికి వదిలేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా వారి సంక్షేమానికి పాటు పడాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచించారు. తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదికలో చేరిన క్రిస్టఫర్, గడ్డం యాదగిరి లకు ముఖ్య బాధ్యతలను ఈ సందర్భంగా అప్పగించారు. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా క్రిస్టఫర్, రాష్ట్ర కార్యదర్శిగా యాదగిరి, కొండాపురం శ్రీనివాస్ ను రాష్ట్ర ఉపాధ్యక్షులుగా, ములుగు లక్ష్మయ్యను భువనగిరి జిల్లా అధ్యక్షులుగా నియమిస్తూ నియామక పత్రాలను సోమయ్య అందజేశారు. కేకే కమిటీ కాలయాపన లేకుండా ఉద్యమకారులకు అండగా నిలవాల్సిన అవసరత ఎంతైనా ఉందని బత్తుల సోమయ్య సూచించారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: