- తొలి విజయం ప్రత్యేక ఎస్టీ కమిషన్
- గిరిజన లంబాడీల అభివృద్ధి, అభ్యున్నతి ధ్యేయం
- ‘సేన’ రాష్ట్ర అధ్యక్షుడు బాణోత్ హుస్సేన్ నాయక్
ఖమ్మం, (తెలంగాణ కెరటం): దేశానికి స్వాతంత్రం సిద్దించి 80 వసంతాలు కావస్తున్న గిరిజన లంబాడీల మౌళిక సమస్యలు సమస్యలు పరిష్కారం కానీ నేపథ్యంలో సేవా లాల్ సేన రాష్ట్ర అధ్యక్షుడు బాణోత్ హుస్సేన్ నాయక్ తన కమిటీ సభ్యులతో గిరిజన లంబాడీల సమస్యల సాధనకు నడుం బిగించి, ‘తండా బాట’ పట్టారు. ఈ సంవత్సరం అక్టోబర్ 28వ తేదిన భద్రాద్రి - కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం నుంచి ఈ తండా బాట (ప్రతీ తండాలో నిద్రించడం) కార్యక్రమాన్ని ప్రారంభించారు. అక్కడి నుంచి ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, సిరిసిల్ల, కరీంనగర్, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి జిల్లాలలో మొదటి దశ యాత్ర పూర్తయింది. తండా బాట సందర్భంగా సేవా లాల్ సేన రాష్ట్ర అధ్యక్షుడు హుస్సేన్ నాయక్ మాట్లాడుతూ.. 2023లో చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన డిక్లరేషన్ ను ప్రకటించిందని అందులో ముఖ్యంగా ఎస్టీలకు చేసిన హామీలు ప్రస్తావించారు.
చేవెళ్ల డిక్లరేషన్ హామీలు:
* అంబేద్కర్ అభయహస్తం అనుసరించి ఎస్టీ కుటుంబాలకు రూ.12 లక్షల ఆర్థిక సాయం
* ఇందిరమ్మ ఇళ్ల పథకం, ఎస్టీలకు ఇంటి స్థలం ఇచ్చి లబ్దిదారులకు 6 లక్షల రూపాయలు మంజూరు
* విద్య జ్యోతి పథకంలో భాగంగా పదో తరగతి పాసైతే రూ. 10 వేల నగదు, డిగ్రీకి 25 వేలు, పీజీకి లక్ష, పీహెచ్డీ పూర్తయితే రూ. 5 లక్షల నగదు.
* సమ్మక్క సారక్క గిరిజన అభివృద్ధి పతకం
* ప్రతీ గ్రామ పంచాయతీకి ఏడాదికి రూ. 25లక్షల అభివృద్ధి పనులు
* ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు...
* ప్రభుత్వ ప్రోత్సాహకాలు పొందే ప్రైవేటు కంపెనీల్లో ఎస్టీలకు రిజర్వేషన్లు, విద్య సంస్థల్లో విద్య రిజర్వేషన్లు
* ప్రభుత్వం తరపున చేపట్టే పనుల్లో కాంట్రాక్ట్ పనులకు రిజర్వేషన్లు
* మైదాన ప్రాంత గిరిజనులకు 9 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం
* గిరిజనులకు పోడు హక్కులు, భూ పట్టాలు
* అసైండ్ భూములకు సంబంధించి సర్వహక్కులు దారా దత్తం
* ప్రతీ మండలంలో గురుకులాల ఏర్పాటు, ఎస్టీ విద్యార్థుల విదేశీ విద్యకు ఆర్థిక సాయం
* ఎస్టీలకు మూడు కార్పోరేషన్లు, ఏడాదికి 5 వందల కోట్ల నిధుల మంజూరు. ఈ హామీలన్నిటినీ పూర్తి చేయాలని హుస్సేన్ నాయక్ డిమాండ్ చేశారు.
సేవా లాల్ సేన డిమాండ్లు :
* ఎస్టీల నూతన గ్రామ పంచాయతీలకు రెవెన్యూ హోదా
* ప్రత్యేక ఎస్టీ కమీషన్ ఏర్పాటు
* ప్రైవేటు యూనివర్సిటీల్లో రిజర్వేషన్లు
* మైదాన ప్రాత గిరిజనులకు చట్ట సభల్లో రాజకీయ అవకాశాలు
* సేవా లాల్ మహరాజ్ మందిరాన్ని నిర్మించాలి
* గోర్ ట్రై బల్ మ్యూజియం ఏర్పాటు చేయాలి
* గోర్ బోలీ భాషను 8వ షెడ్యూల్ లో చేర్చాలి.
* గిరిజన పూజారులకు ధూప దీప నైవేద్యాలతో పాటు గౌరవ వేతనం ఇవ్వాలి
* తిరుమల తిరుపతి హాతీరాం బావాజీ ట్రస్ట్ బోర్డులో గిరిజన లంబాడీలకు అవకాశం కల్పించాలి.
* లంబాడీలకు మంత్రి పదవితో పాటు పలు నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వాలి..
అని హుస్సేన్ నాయక్ డిమాండ్ చేశారు. కాగా ఇందులో కొన్ని సాధించామని, ఇంకా సాధించాల్సిన డిమాండ్లు ఉన్నాయని ప్రకటించారు. తమ తండా బాట సందర్భంగా విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళల సమస్యలు పోలీస్ శాఖ పనితీరు, గిరిజన లంబాడీల ఉపాధి అవకాశాలపై దుష్టి సారించి, అధ్యయనం చేసినట్లు తెలిపారు. ఆశించిన విధంగా గురుకుల ఆశ్రమ పాఠశాలలు లేకపోవడం నిరక్షరాస్యత పెరుగుతుందని ప్రతీ వసతీ గృహంలో మౌలిక సమస్యలు అధికంగా ఉండడం వల్ల పలు ఇబ్బందులు ప్రైవేటు విద్య వైపు దుష్టి సారించిన గిరిజనులకు ఫీజుల భారం పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యలపై పలు సూచనలు చేసినట్లు చెప్పారు. అదే విధంగా తండాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు లేకపోవడం ఉన్న చోట్ల వసతుల లేమీ డాక్టర్లు, నర్సుల కొరత వల్ల గిరిజనులకు సరైన వైద్యం అందటం లేదు. వైద్యం పేరుమీద గిరిజనులను దోపిడికి గురి చేస్తున్నారు. అధిక సంఖ్య తండాల్లో నియంత్రణ లేకపోవడంతో వైన్ షాపులు, బెల్టు షాపులు పెరగడంతో గిరిజన లంబాడీల ఆర్థిక పరిస్థితిని దెబ్బ తీస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయానికి సంబంధించి అమాయక, పేద గిరిజన లంబాడీలు నాసిరకం పురుగుమందులు, విత్తనాలు తీసుకొంటున్నారని, పండించిన పంటకు సరైన ధర లేకపోవడంతో అనేకమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని చెప్పారు. మహిళలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన విధంగా ఏ తండా మహిళను కూడా వడ్డీ లేని రుణాలు ఇవ్వడం, వారిని కోటీశ్వరులుగా చేయడంలో విఫలం చెందారని హుస్సేన్ నాయక్ విమర్శించారు. పోలీస్ శాఖ తీరు తెన్నులపై స్పందిస్తూ.. రాజకీయ నాయకుల ఒత్తిడి వల్ల అనేకమంది గిరిజన లంబాడీ బిడ్డలు అక్రమ కేసుల్లో ఇరుక్కుని, తాము పెట్టే అట్రాసిటీ కేసుల నిర్లక్ష్యం చేయబడం కారణంగా, వారిపై దాడులు చేస్తూ.. వారికి అవమానాలకు గురిచేస్తోందని అన్నారు. ఇతర వర్గాల వలే గిరిజన లంబాడీ యువత కూడా ఉపాధి అవకాశాలు లభించక సతమతం అవుతున్నారని, ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో గిరిజన లంబాడీలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అదే విధంగా గిరిజన భూముల అంశంలో ఆ భూములు అక్రమమని దాడులు చేయడం ఈ భూ ఆక్రమణల విషయంలో కోర్టులకు ఎక్కి గిరిజన పేద లంబాడీలను ఆర్థికంగా దెబ్బతీస్తున్నారని, వారి అసైండ్ భూములను వివిధ కారణాలు చెబుతూ స్వాధీనం చేసుకుంటున్నారని తమ తండా బాట యాత్ర కార్యక్రమంలో వెలుగు చూశాయని పేర్కొన్నారు. దీనిపై తమ ‘తండా బాట’ యాత్ర ఇంకా కొనసాగుతుందని ప్రకటించారు.
