Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

కత్తి మీద సాముల మారిన పత్రిక వ్యవస్థ

Author
Posted By D RAMAKRISHNA
| 15 Nov 2026, 08:46 PM | 10 | NATIONAL, TELANGANA, తెలంగాణ
కత్తి మీద సాముల మారిన పత్రిక వ్యవస్థ
( నేడు జాతీయ పత్రిక దినోత్సవం సందర్భంగా...)

కత్తి మీద సాముల మారిన పత్రిక వ్యవస్థ

  • ✔--- ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ యం డి. షఫీ యు జమ

ఖమ్మం, నవంబర్ 15 (తెలంగాణ కెరటం) :  ప్రతి ప్రజాస్వామిక సౌధానికి  నాలుగవ స్తంభంగా అభివర్ణించబడుతున్న  పత్రికా వ్యవస్థ.... నేడు కత్తిమీద సాముల మారింది. మన దేశంలో ప్రతి సంవత్సరం నవంబర్ 16వ తేదీన జాతీయ పత్రిక దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. దేశంలో 1966 నవంబర్ 16 వ తేదీన ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏర్పాటయింది. దీనిని పురస్కరించుకొని అదే రోజు జాతీయ పత్రిక దినోత్సవం జరుపుకుంటున్నాము. ఒకప్పుడు వార్తల మధ్యలో ప్రకటనలు వచ్చేవి , నేడు ప్రకటన మధ్యలో వార్తలు వస్తున్న పరిస్థితి. ఏదైనా పత్రికలో వార్తలు ప్రచురీతమైనప్పుడు వాటి విశ్వాసనీయత , విలువ, గౌరవం ఎంతో ఉన్నత స్థాయిలో కనిపించేవి. నేడు అందుకు విరుద్ధ పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. ప్రస్తుతం పత్రిక వ్యవస్థకు ప్రత్యామ్నాయ  స్థితిలో సోషల్ మీడియా వేదికగా మారింది.
నేడు పత్రిక వ్యవస్థ, పత్రికకు ప్రజలకు మధ్య వారధులు వంటి పాత్రికేయుల  స్థితిగతుల అంశంపై ఒక సమీక్ష తల పెడితే... పత్రిక వ్యవస్థ గాని పాత్రికేయుల పరిస్థితి గాని ప్రత్యామ్నాయం గా మారిన సోషల్ మీడియా స్థితి గాని ఆందోళన కరంగా ఉన్నదని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఒక విషయం సమీక్ష చేసే సమయంలో నాడు నేడు అని వివరించడం, విపుళీకరించడం సహజం. కాగా ఈ అంశంపై మాత్రం మొన్న నిన్న నేడు గా వర్గీకరించాల్సి వస్తుంది. భారత పత్రిక వ్యవస్థ మన దేశానికి స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ ప్రభుత్వ హాయంలో ప్రారంభమైంది. ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వం పై విమర్శలు చేయడానికి వీల్లేదు. వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ వంటి చట్టాల ద్వారా స్థానిక భాషా పత్రికలపై ఆంక్షలు విధించారు. దేశభక్తి పాటలు పాడిన వ్యాసాలు రాసిన జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చేది. ఆనాడు కూడా చట్టం న్యాయ వ్యవస్థ ఉన్నప్పటికీ అవి బ్రిటిష్ వారికో న్యాయం భారతీయులకు ఒక న్యాయం జరిగేది. స్వాతంత్రం వచ్చిన అనంతరం మన భారత చట్టం ,  న్యాయవ్యవస్థ బ్రిటిష్ ప్రభుత్వ హాయంలో గల ఆంక్షలు తొలగించడం జరిగింది. ఈ సమయంలో పత్రికా వ్యవస్థకు ఒక విశ్వసనీయత గౌరవం విలువ ఉండేవి. భారతదేశం అతి పెద్ద ప్రజాస్వామిక దేశంగా మాత్రమే కాకుండా అనేక ప్రజాస్వామ్య దేశాలకు స్ఫూర్తిగా నిలిచేది. ప్రస్తుతం ఆ పరిస్థితి క్షీణించింది. ప్రజాస్వామ్యా హక్కుల సాధన తో పాటు పత్రిక వ్యవస్థ స్వేచ్ఛ హరించ బడుతోంది. పత్రిక వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా ఇటీవల ఎదిగిన సోషల్ మీడియా పరిస్థితి కూడా ఇంతే విధంగా తయారైంది. ప్రపంచ ర్యాంకింగ్ లో మన పత్రిక వ్యవస్థ స్వేచ్ఛ ఆందోళన
కరంగా ఉంది. మనదేశంలో పత్రిక స్వేచ్ఛకు  ప్రత్యేకంగా ఒక అదీకరణ లేనప్పటికీ ఆర్టికల్ (19) (ఎ) లోని భావ ప్రకటన స్వేచ్ఛ లోనే పత్రిక స్వేచ్ఛ అంతర్భాగంగా ఉంది. కాగా ఆర్టికల్ 19 (2) కింద ఉండే పరిమితులను  (దేశ సార్వభౌమత్వం , శాంతి భద్రతలు)  ప్రభుత్వం విస్తృతంగా వినియోగించుకుంటూ మీడియా స్వాతంత్రాన్ని నియంత్రిస్తోంది. ఇదే సమయంలో డిజిటల్ మీడియా, యూట్యూబ్ జర్నలిజం పెరగడం, ప్రత్యామ్నాయ స్వరం వినిపించేందుకు కొత్త వేదికలు అవిష్కారం చెందుతున్నప్పటికీ వాటిపై కూడా నిఘా, ఒత్తిడి సాగుతున్నాయి. ఇదిలా ఉండగా  ఐటీ రూల్స్ 2021,  టెలి కమ్యూనికేషన్ చట్టం 2023, డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్  వంటి కొత్త నిబంధనల ద్వారా ఆన్లైన్ న్యూస్ పోర్టల్స్, డిజిటల్ జర్నలిస్టులపై ప్రభుత్వ పర్యవేక్షణ పెరిగింది. తద్వారా డిజిటల్ మీడియాపై నియంత్రణ ప్రభుత్వానికి లభించింది. ఇదే సమయంలో జాతీయ భద్రత , దేశ సార్వ బౌ మత్వం పేరుతో ఆన్లైన్ కంటెంట్ ను నిలిపివేసే
అధికారాలు ప్రభుత్వానికి విస్తృతంగా లభించాయి. అంతేకాకుండా దేశద్రోహం పేరుతో ఊపా, ఐటి వంటి చట్టాల ద్వారా జర్నలిస్టులపై కేసును నమోదు చేయటం ఇటీవల కాలంలో ఎక్కువైంది. ఇలాంటి పరిస్థితులు 2014 అనంతరం కాలంలోనే  ప్రారంభమయ్యాయి. 2014 తర్వాతనే భారతదేశంలో పత్రిక స్వేచ్ఛ గణనీయమైన మార్పులకు గురైంది. ఇదే సమయంలో
అంతర్జాతీయ సూచీలలో భారత ర్యాంకింగ్ నిరంతరం క్షీణిస్తూ వస్తోంది. రిపోర్టర్ రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్  (ఆర్ ఎస్ ఎఫ్) ప్రచురించే వరల్డ్ ప్రెస్ ఇండెక్స్ ప్రకారం 2014లో 140 వ స్థానంలో ఉన్న భారతదేశం 2026 నాటికి 180 దేశాల  జాబితాలో 157 వ స్థానానికి పడిపోయింది. ఇక్కడ 2023  - 24 లో సైతం 159 వ నుండి 161 వ స్థానం వరకు క్షీణించింది. అంతర్జాతీయ నివేదికల ప్రకారం ఇది తీవ్రమైన పరిస్థితి. ఇక్కడ పత్రిక స్వేచ్ఛ తీవ్రమైన సవాలుతో కూడినది గా అభివర్ణించబడింది. ఇదే సమయంలో భారతదేశంలో వేల సంఖ్యలో మీడియా సంస్థలు ఉన్నప్పటికీ జతస్థాయిలో ప్రధాన మీడియా నెట్వర్క్లు కేవలం కొద్దిమంది పెద్ద కార్పొరేట్ శక్తుల చేతుల్లోనే కేంద్రీకృతం కావడం జరిగింది. అదేవిధంగా గోబీ మీడియా అనే ఒక ప్రభుత్వ అనుకూల మీడియా ఏర్పాటై  ప్రభుత్వంపై వచ్చే విమర్శలను ఆరోపణలను తీవ్రంగా ఖండించడమే కాకుండా విమర్శకులను సంఘ విద్రోహక శక్తులు దేశ విచ్చిన్నల శక్తులుగా ఆరు కొరలు ఆరోపణలు గుర్తిస్తుంది ఫలితంగా జర్నలిజం విలువలు తన వలువలను కోల్పోయినట్టుగా విశ్లేషకులు భావిస్తున్నారు.
" 2014 ముందు తరువాత దేశంలోమన పత్రికల స్వేచ్చా   ర్యాంకింగ్స్ "
బ్రిటిష్ హయంలో,  అనంతరం స్వాతంత్ర్య భారతదేశంలో , 2014 తదనంతరం మన పత్రికల స్వేచ్ఛ ఏ విధంగా దిగజారుతు వచ్చాయో , వాటి గణాంకాలు పరీలిద్దాం. రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ (ఆర్ ఎస్ ఎఫ్) ప్రచురించే వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్  (అంతర్జాతీయ పత్రిక స్వేచ్ఛ సూచిక) ప్రకారం......
ప్రతి సంవత్సరంలో భారతదేశానికి సంబంధించిన పత్రిక స్వేచ్ఛ సూచిక ఇది. 2009లో 175 దేశాలకు గాను మన స్థానం 105.  2010లో 178 దేశాలకు గాను మన స్థానం 122. 2011- 12 లో 178 దేశాలకు గాను మన స్థానం 131. 2013 లో 179 దేశాలలో నిర్వహించిన సర్వేను అనుసరించి మనకు కేటాయించిన స్థానం 140. 2014లో సైతం 180 దేశాలకు గాను మన స్థానం 140. కాగా ప్రస్తుతం 2026 లో 180 దేశాలలో నిర్వహించిన సర్వేను అనుసరించి మన స్థానం పత్రిక స్వేచ్ఛలో 157 వ ర్యాంకింగ్ కు పడిపోయింది. వీటికి కారణాలుగా భద్రతా సమస్యలు ,దాడులు, కేసుల నమోదు, అప్పుడప్పుడు ఇంటర్నెట్ నిలిపివేత. జర్నలిస్టుల హత్యలు. తాజా ఉదాహరణ : నార్వే మహిళ
జర్నలిస్టు హెల్లే లింగ్ వీసా రద్దు చేయడం. పత్రికలు,పాత్రికేయులు, జర్నలిస్టు సంఘాలు, పౌర సమాజం దీనిపై ఉద్యమిస్తే తప్ప ఈ పరిస్థితులు మారవు. పైగా మరింత దిగజారి పోతాయి.

----ఫ్రీలాన్స్ జర్నలిస్ట్  యం డి. షఫీ యు జమ

కత్తి మీద సాముల మారిన పత్రిక వ్యవస్థ
మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: