Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

మా పై కక్ష గట్టారు... మా పొట్టమీద కొట్టారు!

Author
Posted By D RAMAKRISHNA
| 16 Nov 2026, 05:27 PM | 11 | TELANGANA, తెలంగాణ
మా పై కక్ష గట్టారు... మా పొట్టమీద కొట్టారు!
మా పై కక్ష గట్టారు... మా పొట్టమీద కొట్టారు!
  • జ్యూస్ పాయింట్ డబ్బా కూల్చివేత తో రోడ్డున పడ్డం 
  • బాధితుల ఆందోళన 

ఖమ్మం, నవంబర్ 16: ఖమ్మం నగరంలోని 42వ డివిజన్లో నివసించే రేకుల రాంబాబు, అమల దంపతులు పాత చేపల మార్కెట్ సమీపంలో గత పది ఏళ్లుగా చిన్న డబ్బా ఏర్పాటు చేసుకొని జ్యూస్ పాయింట్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నామని ఆ డబ్బాను కొంతమంది తమపై కక్షగట్టి మున్సిపల్ అధికారులతో కలిసి తొలగించాలని ఆరోపించారు. వివరాలు వారి మాటల్లోనే... మునిసిపల్ సిబ్బంది కానీ అధికారులు కానీ ముందస్తుగా తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని, పాత బస్టాండ్ దగ్గర నుంచి జెడ్పీ సెంటర్ వరకు రోడ్డుకు ఇరువైపులా ఫుట్పాతులను యతేచగా ఆక్రమించుకున్న వారిని ఏమీ చేయడం లేదని, చిన్నపాటి డబ్బాను అది కూడా ఎవరికి ఆటంకం లేని ప్రదేశంలో ఏర్పాటు చేసుకొని కుటుంబాన్ని పోషించుకుంటున్న తమపై కావాలనే కక్షగట్టి తొలగించాలని కన్నీటి పర్యంతమయ్యారు. తమకు న్యాయం చేయాలని మున్సిపల్ కమిషనర్ను కలిసేందుకు వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేశారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: