ఏకీన్ పూర్ సింగిల్ విండో చైర్మన్ సింగిరెడ్డి నర్సారెడ్డి
తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 16 : దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని ఏకీన్ పూర్ సింగిల్ విండో చైర్మన్ సింగిరెడ్డి నర్సారెడ్డి సూచించారు. కోరుట్ల మండలం ఏకీన్ పూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలోని పెద్దపూర్, రామారావు పల్లెలో కొనుగోలు కేంద్రాలను సింగిల్ విండో చైర్మన్ సింగిరెడ్డి నర్సారెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగాసింగిరెడ్డినర్సారెడ్డిమాట్లాడుతూ..రైతులు పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా విక్రయించుకొని, మద్దతు ధర పొందాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రం నిర్వాహకులు తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. రైతులు నాణ్యతా ప్రమాణాలు పాటించి, ధాన్యాన్ని తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచ్ లు, ప్యాక్స్ సీఈవో తాజుద్దీన్ బాబా, పాలక వర్గ సభ్యులు, రైతులు, సంఘ సిబ్బంది పాల్గొన్నారు.



