Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

సింగరేణి కార్పొరేట్ జనరల్ మేనేజర్ (క్వాలిటీ

Author
Posted By TELANGANA KERATAM
| 18 Nov 2026, 06:04 AM | 3 | Politics, తెలంగాణ
సింగరేణి కార్పొరేట్ జనరల్ మేనేజర్ (క్వాలిటీ
సింగరేణి కార్పొరేట్ జనరల్ మేనేజర్ (క్వాలిటీ )రవి కుమార్ కి ఘనంగా వీడ్కోలు సభ.......
తెలంగాణ కెరటం మంచిర్యాల జిల్లా ప్రతినిధి రాం వేణు....
మంచిర్యాల..
​మందమర్రి ఏరియా: సింగరేణి కార్పొరేట్ జనరల్ మేనేజర్ (క్వాలిటీ) రవికుమార్ ఈ నెలలో పదవీ విరమణ పొందనున్న సందర్భంగా మంగళవారం నాడు మందమర్రి ఏరియాను సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక జనరల్ మేనేజర్ కార్యాలయంలో యాజమాన్యం మరియు అధికారుల ఆధ్వర్యంలో వారికి ఘనంగా వీడ్కోలు సభను నిర్వహించారు.​మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ ఎన్. రాధాకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొని, రవికుమార్ గారు సంస్థకు అందించిన సుదీర్ఘ, విశిష్ట సేవలను కొనియాడారు. అనంతరం వారిని శాలువాతో ఘనంగా సత్కరించి, జ్ఞాపికను బహూకరించారు.
​ఈ సందర్భంగా ఏరియా జీఎం ఎన్. రాధాకృష్ణ మాట్లాడుతూ... సింగరేణి సంస్థ అభివృద్ధిలో, ముఖ్యంగా రక్షణతో కూడిన ఉత్పత్తితో పాటు బొగ్గు నాణ్యత (క్వాలిటీ) ప్రమాణాలను పెంపొందించడంలో రవికుమార్ గారు చూపిన శ్రద్ధ ఎంతో గణనీయమని అన్నారు. సుదీర్ఘ కాలం పాటు ఎలాంటి మచ్చ లేకుండా, పూర్తి నిబద్ధతతో పనిచేసి సంస్థ ప్రగతికి ఆయన విశేష తోడ్పాటు అందించారని అభినందించారు.
​ఈ వీడ్కోలు సమావేశంలో ఎస్.ఓ టు జీఎం (SO to GM) జి.ఎల్. ప్రసాద్, ఏజీఎం (F&A) ఆర్.వి.ఎస్.ఆర్.కె. ప్రసాద్, కేకే ఏజెంట్ ఖాదిర్, శాంతిఖని ఏజెంట్ సంతోష్ కుమార్, డీజీఎం (IED) కిరణ్ కుమార్, ఏరియా సేఫ్టీ ఆఫీసర్ మురళి, డీజీఎం (సివిల్) మదీనా భాష, డీజీఎం (సర్వే) భూక్య దేశాయ్, క్వాలిటీ అధికారి ప్రదీప్, ఏరియా సెక్యూరిటీ అధికారి వెంకటేశ్వర్ రెడ్డితో పాటు మందమర్రి ఏరియా గనులు మరియు వివిధ విభాగాల ఉన్నతాధికారులు పాల్గొని ఆయనకు పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: