కోటగిరి మండలంలో నూతన చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమం
తెలంగాణ కెరటం కోటగిరి మండలం నవంబర్ 17
పేదలు, వితంతువులు ఒంటరి మహిళ కు చేయూత అందించడమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి
కోటగిరి మండలంలో నూతన చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆగ్రో ఇండస్ట్రీస్ మాజీ చైర్మన్ కాసుల బాలరాజ్ ఏంపాల్గొన్నారు.
ఈ సందర్భంగా నూతనంగా మంజూరైన చేయూత పింఛన్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. పేదలు, వితంతువులు ఒంటరి మహిళలు మరియు అర్హులైన వారికి ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం చేయూత పింఛన్లను అందిస్తోందని ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా కృషి చేయాలని, పేద ప్రజలకు అండగా నిలవాలని వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు సాహిద్ హుస్సేన్ యూ కోటగిరి గ్రామ సర్పంచ్ బర్ల మధు మాజీ జెడ్పిటిసి శంకర్ పటేల్ మాజీ ఎంపిటిసి కొట్టమ మనోహర్ మాజీ సర్పంచ్ పత్తి లక్ష్మణ్ మాజీ సొసైటీ చైర్మన్ సిద్దు మాజీ ఎంపిటిసి సలీం తదితరులు నాయకులు పాల్గొన్నారు



