Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యం

Author
Posted By TELANGANA KERATAM
| 18 Nov 2026, 08:00 AM | 4 | Politics, తెలంగాణ
పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యం
పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యం

తెలంగాణ కెరటం 
17 నవంబర్ 
ఎల్లారెడ్డి ప్రతినిధి 

ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆధ్వర్యంలో నూతన చేయూత పెన్షన్ల మంజూరు పత్రాల పంపిణీ
5 మండలాల్లో 1,741 కుటుంబాలకు సంక్షేమ భరోసా
సదాశివనగర్ పట్టణంలోని అశోక్  గార్డెన్స్‌లో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆధ్వర్యంలో నూతన చేయూత పెన్షన్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని  తాడ్వాయి, గాంధారి, సదాశివనగర్, రామారెడ్డి, రాజంపేట్ మండలాలలోని అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన చేయూత పెన్షన్ల మంజూరు పత్రాలను ఎమ్మెల్యే మదన్ మోహన్  అందజేశారు.
మండలాల వారీగా పెన్షన్ల వివరాలు
1. తాడ్వాయి – 407 కుటుంబాలకు
2. గాంధారి – 717 కుటుంబాలకు
3. సదాశివనగర్ – 475 కుటుంబాలకు
4. రామారెడ్డి – 223 కుటుంబాలకు
5. రాజంపేట్ – 219 కుటుంబాలకు
మొత్తం – 1,741 లబ్ధిదారుల కుటుంబాలకు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. పెన్షన్లు కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాకుండా, అర్హులైన కుటుంబాలకు ఆత్మగౌరవంతో జీవించేందుకు తోడ్పడే భరోసా అని పేర్కొన్నారు.
నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రతి పేద కుటుంబ సంక్షేమానికి సమాన ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతున్నామని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా అర్హులైన కుటుంబాలకు మరింత చేయూత అందించేందుకు కృషి చేస్తామని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సంబంధిత శాఖల అధికారులు, పెన్షన్ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: