బాలు ను అభినందించిన సీనియర్ సివిల్ జడ్జ్ నాగరాణి
తెలంగాణ కెరటం
17 నవంబర్
కామారెడ్డి
జాతీయ పురస్కారం అందుకోవడం అభినందనీయం
కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఈ రోజు జిల్లా న్యాయ సేవాధికారిత సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ నాగరాణి శ్రీ రాందాస్ అగర్వాల్ జన్ సేవా సమ్మాన్ జాతీయ పురస్కారం అందుకున్న సందర్భంగా ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయ సభ్యులు డాక్టర్ బాలు ను అభినందించి, సన్మానించడం జరిగింది. తల సేమియా బాధిత చిన్నారుల కోసం రక్తదాన శిబిరాలు,ఆపదలో ఉన్నవారికి నిరంతరంగా రక్తాన్ని అందజేయడం అభినందనీయమని సమాజసేవ కార్యక్రమాలలో యువత ముందుకు రావాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సూపరిండెంట్ వంచ చంద్రసేన్ రెడ్డి,సమీ ఉల్లా ఖాన్ లు పాల్గొనడం జరిగింది.



