Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

*భారత వంశక్రమం

Author
Posted By NARESH PIPPARA
| 18 Nov 2026, 04:00 PM | 4 | Bhakti, ఆధ్యాత్మికత, తెలంగాణ
*భారత వంశక్రమం
  • *భారత వంశక్రమం
*భారత వంశక్రమం:*

  • దుష్యంతుడి తండ్రి పేరు ఇలినుడు (ఇలినా/సంతురోధ) మరియు తల్లి పేరు రథంతరి (ఉపాదనవి).
  • శకుంతల_దుష్యంతులకు పుట్టినవాడు భరతుడు.
  • భరతుడికి సునందవలన భూమన్యుడు పుట్టాడు.
  • భూమన్యుడికి విజయవలన సుహోత్రుడు జన్మించాడు.
  • సుహోత్రుడికి సువర్ణ వలన హస్తి అనేవాడు పుట్టాడు. *ఇతడి పేరు మీదుగానే కౌరవుల రాజధాని హస్తినాపురమనే నగరం వెలిసింది.*
  • హస్తికి యశోధర వలన వికుంఠనుడు పుట్టాడు.
  • వికుంఠనుడకి వాసుదేవాయందు అజమీడుడు జన్మించాడు.
  • అజమీడుడు కైకేయి, గాంధారి, ఋక్ష అనే ముగ్గుర్ని వివాహమాడాడు. వీరికి ముగ్గురికీ 124 మంది పుత్రులు కలికి వివిధ రాజ్యాలేలారు. వారందరిలో సంవరణుడు శ్రేష్టుడు.
  • సంవరణుడు సూర్యుని పుత్రిక అయిన తపతి ని వివాహమాడాడు. వారికి కురుడు అనే శ్రేష్ఠమైన పుత్రుడు పుట్టాడు. అతని పేరుమీదనే కురుక్షేత్రమనే పేరు సార్థకమైంది. అట్టి కురుడికి శుభాంగి వలన విధూరథుడు పుట్టాడు. 
  • అతడికి అనశ్వుడు, అనశ్వుడికి పరీక్షిత్తు పుట్టారు.
  •  పరీక్షిత్తుకు భీమసేనుడు అతడికి ప్రదీపుడు పుట్టాడు. ప్రదీపుడికి దేవాపి, శంతనుడు, బాహ్లికుడు అని ముగ్గురు పుట్టారు. వారిలో దేవాపి బాల్యంలోనే తపోవనాలకు వెళ్లగా శంతనుడు రాజయ్యాడు. 
  • అతడికి గంగాదేవి వలన దేవవ్రతుడైన భీష్ముడు పుట్టాడు. అంతే కాకుండా శంతనుడికి యోజనగంధికి (సత్యవతికి) చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు రాజయ్యాడు. భీష్ముడు కాశీరాజు కుమార్తెలైన అంబికా, అంబాలికలనే వారిద్దరినీ విచిత్రవీర్యుడికిచ్చి వివాహం చేశాడు. విచిత్రవీర్యుడు సంతానం లేకుండా క్షయ రోగంతో మరణించాడు. ఇక్కడితో భారత వంశం విచ్చేదం అయ్యే పరిస్థితి ఏర్పడింది.

 అప్పుడు సత్యవతి (యోజనగంధి) వ్యాసమహర్షిని పిలిచి భారత వంశాన్ని విచ్చేదం కాకుండా నిలుపమని ఆదేశించింది. అప్పుడా మహాత్ముని వలన దేవర న్యాయంతో అంబికయందు ధృతరాష్టుడు, అంబాలికయందు పాండురాజు, అంబిక చెలికత్తె యందు విదురుడు జన్మించారు.

 వారిలో దృతరాత్రుడికీ, గాంధారికీ దుర్యోధనాదులు నూరుమంది పుత్రులు జన్మించారు. పాండురాజుకు కుంతీ మాద్రిల యందు యమధర్మరాజు అంశతో ధర్మరాజు, వాయుదేవుని అంశతో భీమసేనుడు, ఇంద్రుని అంశతో అర్జునుడు, అశ్వనీ దేవతల అంశతో నకుల సహదేవులు జన్మించారు.

 వీరి ఐదుగురికి ద్రౌపది భార్య అయ్యింది. ఆమెయందు ధర్మరాజు వలన ప్రతివింద్యుడు, భీమసేనుడివలన శ్రుతసోముడు, అర్జునునివలన శ్రుతకీర్తి,  నకులునివలన శతానీకుడు, దేవునివలన శృతసేణుడు జన్మించారు. ఈ ఐదుగురిని ఉప పాండవులు అంటారు.

 వీరుకాక ధర్మరాజుకు దేవిక వలన యౌదేయుడు, భీమునికి జరందర వలన సర్వగుడు పుట్టారు. అర్జునునికి సుభద్రవలన అభిమన్యుడు, నకులుడికి కరేణుమతికి నిరమిత్రుడు, సహదేవుని విజయవలన సుహోత్రుడు. వీరుకాక భీముడికి హిడింభి వలన ఘటోత్కచుడు పుట్టాడు. 

ఈవిధంగా ఈ పదకొండు మందిలో ఒక్క అభిమన్యుడు మాత్రమే భారత వంశాన్ని నిలబెట్టగలిగాడు. అభిమన్యుడికి ఉత్తరవలన పరీక్షిత్తు( ఇదే వంశంలో పరీక్షిత్తు అనే పేరుతో రెండవ వాడు) పుట్టాడు.
____
ఓ జనమేజయుడా! పాండవ వంశానికి కీర్తిని సుస్థిరం చేసేందుకే నువ్వు పరీక్షిత్తుకు మద్రావతికి జన్మించవు. ఇప్పుడు నీకు వపుష్టమకూ శతానీకుడు, శంకుకర్ణుడు అనే ఇద్దరు పుట్టారు. వీరిలో శతనీకుడికీ విదేహరాజపుత్రిక వైదేహికీ అశ్వమేథ దత్తుడు జన్మించాడు. ఈ వంశస్తులంతా ఐలులనీ, పౌరవులని, భారతులని, కౌరవులని, పాండవులనీ పిలువబడుతూ వీరులుగా ప్రసిద్ధి చెందారు. ఇది లోకంలో ప్రసిద్ధికెక్కిన వంశక్రమం. ఈ వంశక్రమం అంతా విన్న జనమేజయుడు వైశంపాయనుడితో ఇలా అన్నాడు  "శంతనుడికి గంగకు పొత్తు ఎలా కలిగింది. వారిద్దరికీ భీష్ముడు ఎట్లా జన్మించాడు? నాకు ఈ వృత్తాంతాన్ని విపులంగా చెప్పమని అడిగాడు.
.....

*మహాభారతం* 
*భరతుడు*
*హస్తినాపురం*
*కురుక్షేత్రం*
*ఆదిపర్వం చతుర్థాశ్వాసము*

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: