Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

సింగరేణి సమస్యల పరిష్కారం కోసం ఏఐటీయూసీ రిలే నిరాహార దీక్ష.....

Author
Posted By TELANGANA KERATAM
| 19 Nov 2026, 07:35 AM | 5 | Politics, తెలంగాణ
సింగరేణి సమస్యల పరిష్కారం కోసం ఏఐటీయూసీ రిలే నిరాహార దీక్ష.....
సింగరేణి సమస్యల పరిష్కారం కోసం ఏఐటీయూసీ రిలే నిరాహార దీక్ష.....

 24 పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్.. 
సంఘీభావం తెలిపిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు.......

తెలంగాణ కెరటం మంచిర్యాల జిల్లా ప్రతినిధి రాం వేణు....
మంచిర్యాల....
మందమర్రి సింగరేణి కార్మికుల 24 పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా మందమర్రి జీఎం కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. కార్మికుల దీర్ఘకాలిక సమస్యలను యాజమాన్యం పరిష్కరించాలని ఈ సందర్భంగా నాయకులు డిమాండ్ చేశారు.
ఈ రిలే నిరాహార దీక్షకు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు సంఘీభావం ప్రకటించి దీక్షలో పాల్గొన్న కార్మికులకు మద్దతు తెలిపారు. సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన పోరాటానికి తన మద్దతు ఉంటుందని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న 24 సమస్యలపై యాజమాన్యం స్పందించి తక్షణమే పరిష్కార చర్యలు చేపట్టాలని కార్మిక సంఘం నాయకులు కోరారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: