నీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించాలి
బుజరంపేటలో గ్రామసభ.. ప్రతి ఇంటికి ఇంకుడు గుంత తప్పనిసరి
కౌడిపల్లి తెలంగాణ కెరటం నవంబర్ 18
మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని బుజరంపేట గ్రామంలో గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీడీవో శ్రీనివాస్, ఎమ్మార్వో కృష్ణ, ఏ పీ ఓ పుణ్యదాస్ హాజరై ఎల్‌నినో ప్రభావం, భవిష్యత్తులో నీటి కొరత ఏర్పడే అవకాశాలు, నీటి సంరక్షణ చర్యలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ప్రతి ఇంట్లో తప్పనిసరిగా ఇంకుడు గుంత నిర్మించుకోవాలని, వర్షపు నీటిని భూమిలోకి ఇంకేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించాలని, రైతులు ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మార్వో కృష్ణ మాట్లాడుతూ గ్రామంలో తాగునీటి కొరత ఏర్పడినప్పుడు స్థానికంగా మోటార్ ఏర్పాటు చేసుకుంటే నెలకు రూ.6 వేల చొప్పున చెల్లించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. నీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.గ్రామ సర్పంచ్ పట్లోళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ మిషన్ భగీరథ అధికారులు గ్రామంలో తలెత్తుతున్న నీటి సమస్యలను ఎప్పటికప్పుడు త్వరగా తమ దృష్టికి తీసుకురావడం లేదని అన్నారు. ఇకపై గ్రామంలో నీటి వృథాను అరికట్టేందుకు ప్రజలందరినీ భాగస్వాములను చేస్తూ తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.అనంతరం నూతనంగా పెన్షన్లు మంజూరైన లబ్ధిదారులకు పెన్షన్ పత్రాలను అధికారులు, ప్రజాప్రతినిధులు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఏపీవో పుణ్యదాస్, ఎంపీవో, ఏఈవో నరేందర్, మిషన్ భగీరథ అధికారి విశ్వసాయి, పంచాయతీ కార్యదర్శి రత్నం, సర్పంచ్ పట్లోళ్ల శ్రీనివాస్,ఉప సర్పంచ్ కౌడిపల్లి గోపాల్, వార్డు సభ్యులు అమృత, లక్ష్మయ్య, ఆంజనేయులు, శ్రీను, సురేష్, వైష్ణవి, అశోక్, వెంకటలక్ష్మి, పెంటయ్య, రాములు, విజయ, చంద్రయ్య, ఫిదా ఫీల్డ్ అసిస్టెంట్ వీరేశం, ఏఎన్ఎం మాధవి, డాక్టర్ రవళి,ఆశ వర్కర్స్ అంగన్వాడి టీచర్స్ పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.



