జనరల్ మేనేజర్ కార్యాలయం మరియు సింగరేణి హై స్కూల్ పాఠశాలను సందర్శించిన సింగరేణి ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యదర్శి రాజేంద్రప్రసాద్.....
తెలంగాణ కెరటం మంచిర్యాల జిల్లా ప్రతినిధి రాం వేణు....
మంచిర్యాల..
ఈరోజు మందమర్రి ఏరియాలోని సింగరేణి హై స్కూల్ పాఠశాలను మరియు జనరల్ మేనేజర్ కార్యాలయం ను మొదటిసారిగా సందర్శించిన జనరల్ మేనేజర్ ఎడ్యుకేషనల్ ( కార్పొరేట్ )రాజేంద్రప్రసాద్ మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ ఎన్. రాధాకృష్ణ మరియు అధికారులు ఘనంగా స్వాగతం పలికి పుష్పగుచ్చాలు అందించి శాలువాతో సన్మానించారు.
అనంతరం మందమర్రి ఏరియాలోని సింగరేణి హై స్కూల్ పాఠశాలను సందర్శించారు.
పదవ తరగతి విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించి, విద్యార్థులు క్రమశిక్షణతో, పట్టుదలతో చదివి పదవ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించి విజయాన్ని అందుకోవాలని ఆకాంక్షించారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తూ, వారి భవిష్యత్తుకు ఉపయోగపడే పలు విలువైన సూచనలు చేశారు.
అనంతరం ఉపాధ్యాయులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ, ప్రతి విద్యార్థిలో భాషా నైపుణ్యాలను పెంపొందించడం ఉపాధ్యాయుల ప్రధాన బాధ్యత అని తెలిపారు. ముఖ్యంగా LSRW (Listening, Speaking, Reading, Writing) నైపుణ్యాలను ఆంగ్లం, హిందీ, తెలుగు భాషల్లో తప్పనిసరిగా అభివృద్ధి చేయాలని సూచించారు. విద్యార్థులు గణితంలో కూడా చురుకుదనాన్ని, సామర్థ్యాన్ని పెంపొందించుకునేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని, ప్రతి విద్యార్థి ఏదైనా విషయాన్ని పట్టుదలతో నేర్చుకునే విధంగా ప్రోత్సహించాలని మార్గనిర్దేశం చేశారు.
పాఠశాల అభివృద్ధిలో భాగంగా విద్యార్థుల రవాణా సౌకర్యం కోసం స్కూల్ బస్సులు ఇప్పటికే వచ్చాయని, అతి త్వరలోనే విద్యార్థులకు బస్సు సౌకర్యం అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. అలాగే పాఠశాలను మరింత ఆధునికంగా తీర్చిదిద్దేందుకు డిజిటల్ బోర్డులు, ఆధునిక కంప్యూటర్లు త్వరలోనే సమకూరుస్తామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ అశోక్ మాట్లాడుతూ, పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు జీఎం కార్యాలయం ద్వారా మరియు కరస్పాండెంట్‌గా తన వంతు సహాయ సహకారాలను ఎల్లప్పుడూ అందిస్తానని తెలిపారు. పాఠశాల అభివృద్ధికి అవసరమైన ప్రతి కార్యక్రమంలో తన పూర్తి సహకారం ఉంటుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్ ఓ టు జి ఎం, జి ఎల్. ప్రసాద్,
ఏజీఎం (F&A) ఆర్.వి.ఎస్.ఆర్.కె. ప్రసాద్, డి జి ఎం (పర్సనల్) సిహెచ్.అశోక్, కేకే ఓ సి ప్రాజెక్ట్ ఆఫీసర్, రాంబాబు, డీజీఎం (ఐ డి) కిరణ్ కుమార్, పర్చేస్ ఆఫీసర్, బాబు, సీనియర్ పిఓలు, సింగరేణి హై స్కూల్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు జె.పురుషోత్తం, సింగరేణి హై స్కూల్ ఉపాధ్యాయులు, ఉపాధ్యాయురాలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.



