ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా పథకంపై అవగాహన సమావేశం
తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 18 : భీమారం మండల కేంద్రంలో బుధవారం మండల గ్రామాల సర్పంచులు, గ్రామ కార్యదర్శులకు ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా పథకంపై అవగాహన సమావేశం నిర్వహించారు. మండల గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా పథకం నమోదు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ పథకం ద్వారా ప్రతి కుటుంబములో కుటుంబ పెద్దకు జీవిత బీమా పథకం వర్తిస్తుందని, ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంలో అర్హత గల వారి వయస్సు 18 నుండి 59 సంవత్సరాల మద్య ఉన్న వారు ఈ పథకానికి అర్హులని తెలిపారు. ఈ పథకంలో నమోదు చేసుకునే సమయంలో బీమాదారుని ఆధార్ కార్డు జిరాక్స్ ప్రతిని తప్పనిసరిగా తీసుకురావాలని, అలాగే కుటుంబ సభ్యులందరి ఆధార్ కార్డు నంబర్లు, ఆహార భద్రత కార్డు లేదా రేషన్ కార్డు (ఉంటే), మొబైల్ నంబర్, నామినికి సంబంధించిన వివరాలను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. నామినీ మైనర్ అయిన సందర్భంలో అపాయింటీ ఆధార్ కార్డు వివరాలు కూడా సమర్పించాలని పేర్కోన్నారు. ఈ సమావేశంలో తహశీల్దార్ కోట వసంత, ఎంపిడివో వేముల విజయలక్ష్మి, తదితర సిబ్బంది పాల్గొన్నారు.



