మహనీయుల ఆశయ సాధనకు మాదిగ విద్యార్థులు సిద్ధం కావాలని నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట కళాశాల లో ఎం ఎస్ ఎఫ్ కళాశాల కమిటీల నీ అమ్మకం చేపట్టారు.దేశంలో శతాబ్దాలుగా కొనసాగుతున్న కులపరమైన అవమానాలు, అంటరానితనం, అణచివేత, అసమానతలు, వివక్షత వంటి సామాజిక రుగ్మతలు తొలగిపోయి సమానత్వంతో కూడిన నూతన సమాజ నిర్మాణం జరగాలంటే సామాజిక పరివర్తన విద్యార్థులతోనే సాధ్యమవుతుందని ఎంఎస్ఎఫ్ నాగర్కర్నూల్ జిల్లా ఇంచార్జి మాదిగ కో ఇన్చార్జి శ్రీశైలం మాదిగ అన్నారు. గురువారం అచ్చంపేట పట్టణంలోని మాస్టర్ మైండ్ జూనియర్ కళాశాల మరియు ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో మాదిగ విద్యార్థుల సమావేశాలు నిర్వహించి నూతన ఎంఎస్ఎఫ్ కళాశాల కమిటీలను ఎన్నుకున్నారు. ఈ సమావేశాలకు ఎమ్మార్పీఎస్ నాగర్కర్నూల్ జిల్లా నాయకులు & ఎంఎస్ఎఫ్ అచ్చంపేట నియోజకవర్గ ఇంచార్జీ ఎడెల్లి ఆంజనేయులు మాదిగ అధ్యక్షత వహించగా, జిల్లా నాయకులు ఎంఎస్ఎఫ్ అచ్చంపేట కో-ఇంచార్జీ కొయ్యల వెంకటేష్ మాదిగ సమన్వయం చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏ.రమేష్ మాదిగ, శ్రీశైలం మాదిగ మాట్లాడుతూ కులవివక్షత తన రూపాలను మార్చుకుంటూ నేటికీ దళితులను, పీడిత వర్గాలను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తోందని అన్నారు. కులరహిత భారతదేశ నిర్మాణాన్ని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆకాంక్షించారని, అదే ఆశయ సాధన దిశగా పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ సామాజిక ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తున్నారని తెలిపారు.ఈ ఉద్యమంలో దళిత, పీడిత వర్గాల విద్యార్థులు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మాదిగ విద్యార్థుల్లో విద్య పట్ల అవగాహన పెంచి అక్షరాస్యత శాతాన్ని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఎమ్మార్పీఎస్ సాధించిన ఎస్సీ వర్గీకరణ చట్టం ద్వారా అందుబాటులోకి వచ్చిన 9 శాతం రిజర్వేషన్లను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని విద్యా, ఉద్యోగ రంగాల్లో ఉన్నత స్థానాలకు ఎదగాలని సూచించారు. బుద్ధుడి నుంచి డాక్టర్ అంబేద్కర్ వరకు, అక్కడి నుంచి నేటి మంద కృష్ణ మాదిగ వరకు మహనీయులు చూపిన పోరాట మార్గంలో విద్యార్థులు నడవాలని, ఎంఎస్ఎఫ్ లో చేరి సామాజిక ఉద్యమంలో భాగస్వాములు కావాలని కోరారు.నూతన ఎంఎస్ఎఫ్ కళాశాల కమిటీల నియామకం1. ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, అచ్చంపేటఅధ్యక్షురాలు: బి. అక్షిత ప్రధాన కార్యదర్శి: కె. అంజలిఉపాధ్యక్షురాలు: పి. అంజలిఅధికార ప్రతినిధి: పి. జ్యోతిసహాయ కార్యదర్శి: కె. శ్రీజ2. మాస్టర్ మైండ్ జూనియర్ కళాశాల, అచ్చంపేటఅధ్యక్షుడు: కొణిగారి అభిలాష్
ప్రధాన కార్యదర్శి: బరపాటి శ్రవణ్అధికార ప్రతినిధి: ఈ. సంజుకార్యదర్శి: వి. రాముఅధ్యక్షురాలు :అరగంటి రిషిక ప్రధాన కార్యదర్శి:అంతటి సత్యవతి అలీట్ :లక్ష్మి ప్రసన్న బిట్టి :స్ఫూర్తిఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన విద్యార్థి కమిటీ సభ్యులకు నాయకులు అభినందనలు తెలియజేసి, విద్యార్థుల సమస్యల పరిష్కారంతో పాటు ఎంఎస్ఎఫ్ సంస్థాగత బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎఫ్ జిల్లా కో-ఇంచార్జి శ్రీశైలం మాదిగ, ఎం ఆర్ పి ఎఫ్ నాయకులు కొయ్యల వెంకటేష్ మాదిగ, ఎం ఆర్ పి ఎస్ జిల్లా నాయకులు ఎడెల్లి ఆంజనేయులు మాదిగ, అచ్చంపేట మండల అధ్యక్షుడు ప్రవీణ్ మాదిగ తదితరులు, విద్యార్థులు పాల్గొన్నారు.



