Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

అనురాగ్ యూనివర్సిటీలో ఎన్‌ఎస్‌ఎస్ శిబిరం ముగింపు

Author
Posted By TELANGANA KERATAM
| 19 Nov 2026, 06:46 PM | 5 | Politics, తెలంగాణ
అనురాగ్ యూనివర్సిటీలో ఎన్‌ఎస్‌ఎస్ శిబిరం ముగింపు
 యువతలో క్రమశిక్షణ, దేశభక్తి, సేవాభావం, జాతీయ సమైక్యతకు ప్రాధాన్యం
 (తెలంగాణ కెరటం): ఘట్‌కేసర్ ప్రతినిధి / నవంబర్ 19: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా :- ఘట్‌కేసర్ సర్కిల్, పోచారం డివిజన్ పరిధిలోని వెంకటాపురంలో ఉన్న అనురాగ్ యూనివర్సిటీలో నిర్వహించిన వెస్ట్ జోన్ జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్) ప్రీ రిపబ్లిక్ డే పరేడ్ శిబిరం–2026 ముగింపు వేడుకలు నవంబర్ 18న ఘనంగా నిర్వహించారు. వివిధ రాష్ట్రాల నుంచి పాల్గొన్న వాలంటీర్లు సాంస్కృతిక ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్. నాగరాజు, గౌరవ అతిథులుగా అనురాగ్ యూనివర్సిటీ ట్రస్టీ అనురాగ్ పల్లా, ఉపకులపతి డాక్టర్ అర్చనా మంత్రి, ప్రత్యేక అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్‌ఎస్‌ఎస్ అధికారి డాక్టర్ మద్దినేని సుధాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ ఎన్‌ఎస్‌ఎస్ యువతలో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, దేశభక్తి, సామాజిక బాధ్యత, సేవాభావాన్ని పెంపొందించే వేదిక అని పేర్కొన్నారు. ఈ శిబిరం ద్వారా వివిధ రాష్ట్రాల యువతలో జాతీయ సమైక్యత, పరస్పర సహకారం, సాంస్కృతిక అవగాహన పెంపొందాయని తెలిపారు. క్యాంప్ డైరెక్టర్ ఆర్. సైదా నాయక్, క్యాంప్ కోఆర్డినేటర్ డాక్టర్ సి. మల్లేశ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరంలో పాల్గొన్న వాలంటీర్లు, అధికారులను అతిథులు అభినందించారు. శిబిరం విజయవంతానికి సహకరించిన యూనివర్సిటీ యాజమాన్యం, అధ్యాపకులు, సిబ్బందికి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. దేశభక్తి, సేవాభావం, జాతీయ ఐక్యత అనే సందేశంతో శిబిరం ముగిసింది.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: