Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

సంగారెడ్డిలో ఘనంగా ఇందిరా గాంధీ జయంతి వేడుకలు

Author
Posted By TELANGANA KERATAM
| 19 Nov 2026, 07:25 PM | 4 | Politics, తెలంగాణ
సంగారెడ్డిలో ఘనంగా ఇందిరా గాంధీ జయంతి వేడుకలు
సంగారెడ్డిలో ఘనంగా ఇందిరా గాంధీ జయంతి వేడుకలు
తెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 19, నవంబర్
*ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు*
*మెదక్ ఎంపీగా జిల్లా అభివృద్ధికి ఆమె చేసిన సేవలను స్మరించుకున్న నేతలు
భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి వేడుకలను సంగారెడ్డి పట్టణంలో కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. గురువారం పట్టణంలోని ఐబీ చౌరస్తాలో ఉన్న ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ దేశ ప్రధానమంత్రిగా ఇందిరా గాంధీ అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. దేశ అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి ఆమె చేసిన కృషిని స్మరించుకున్నారు. ముఖ్యంగా మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికైన ఇందిరా గాంధీ జిల్లా అభివృద్ధికి విశేష కృషి చేశారని గుర్తుచేశారు. మెదక్ జిల్లా పారిశ్రామిక అభివృద్ధికి, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు ఆమె వేసిన పునాదులు మరువలేనివని పేర్కొన్నారు. ఇందిరా గాంధీ ఆశయాలు నేటి తరాలకు ఆదర్శప్రాయమని, ఆమె చూపిన మార్గంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంత్ కిషన్, మున్సిపల్ చైర్‌పర్సన్ కూన వనితా సంతోష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జార్జ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కిరణ్ గౌడ్, కాంగ్రెస్ నాయకుడు కూన సంతోష్, కౌన్సిలర్లు శ్రీకాంత్, మహేష్ ముదిరాజ్, రమేష్, వంశీ, నాయకులు భూమేష్, అడ్డు తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: