Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ఎమ్మెల్యే చింత ప్రభాకర్‌ను కలిసిన మునిదేవునిపల్లి రైతులు.. సమస్యలు పరిష్కరించాలని వినతి

Author
Posted By TELANGANA KERATAM
| 19 Nov 2026, 07:45 PM | 5 | Politics, తెలంగాణ
ఎమ్మెల్యే చింత ప్రభాకర్‌ను కలిసిన మునిదేవునిపల్లి రైతులు.. సమస్యలు పరిష్కరించాలని వినతి
ఎమ్మెల్యే చింత ప్రభాకర్‌ను కలిసిన మునిదేవునిపల్లి రైతులు.. సమస్యలు పరిష్కరించాలని వినతి
తెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 19, నవంబర్ 
భూ రికార్డుల్లో అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలి.. రైతులకు అండగా ఉంటాం: ఎమ్మెల్యే చింత ప్రభాకర్
సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కొండాపూర్ మండలం మునిదేవునిపల్లి గ్రామానికి చెందిన రైతులు సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్‌ను కలిసి తమ భూ సమస్యలను వివరించి, పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు.
గ్రామంలోని సర్వే నంబర్ 92కు సంబంధించిన భూముల విషయంలో భూ రికార్డుల్లో నెలకొన్న సమస్యలు, భూముల విస్తీర్ణంలో తేడాలు, పంట రుణాలు, చెల్లింపుల్లో అవకతవకలు చోటుచేసుకున్నాయని రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా తమకు రెండు ఎకరాల భూమి ఉన్నప్పటికీ రికార్డుల్లో ఒక ఎకరం 20 గుంటలుగా చూపిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించి, వాస్తవాలను వెలికితీసి, బాధ్యులైన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.రైతులతో సమావేశమైన ఎమ్మెల్యే చింత ప్రభాకర్ వారి సమస్యలను సానుకూలంగా విని, ప్రతి అంశాన్ని పరిశీలించారు. రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని, రైతులకు తాను అండగా ఉంటానని భరోసా కల్పించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి భూ రికార్డుల్లో ఉన్న సమస్యలు, భూముల విస్తీర్ణంలో తేడాలపై సమగ్ర విచారణ జరిపించి, న్యాయం జరిగేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
రైతులకు ఎలాంటి అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని, సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా పారదర్శకంగా విచారణ చేపట్టి అర్హులైన రైతులకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే సూచించారు.ఈ కార్యక్రమంలో మాజీ సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి , మునిదేవునిపల్లి గ్రామానికి చెందిన పలువురు రైతులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: