పాత రెండు వేల పెన్షన్ ఇచ్చి ఇందిరమ్మ సంబరాల
ఎలక్షన్లో మాట ఇచ్చినా నాలుగు వేల పెన్షన్ ఎక్కడ
తెలంగాణ కెరటం బాల్కొండ నియోజకవర్గ ప్రతినిధి నవంబర్ 19 :
నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల కేంద్రంలో మోర్తాడ్ ఉమ్మడి మండలల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్లెడ ఏలియా ,రాజా పూర్ణానందం గురువారం రోజువిలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..
కాంగ్రెస్ రేవంత్ రెడ్డి సర్కారు కు సూటిగా ప్రశ్నలు సంధించడం జరిగింది.పాత 2 వేల పెన్షన్ ఇచ్చి ఇందిరమ్మ సంబరాల ?
మరి ఎన్నికల్లో ఇచ్చిన 4 వేల పెన్షన్ మాటేది? దాని అమలేది.
మోర్తాడ్ మండలంలో గతంలో కెసిఆర్ ప్రభుత్వం ఇచ్చిన పెన్షన్లు.. 7,414
సెప్టెంబర్ 26 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం తగ్గించి ఇచ్చిన పెన్షన్లు 6,964అంటే కాంగ్రెస్ తీసేసిన పెన్షన్లు 450ఇప్పుడు కాంగ్రెస్ కొత్తగా ఇస్తున్న పెన్షన్లు532అంటే450 తీసేసి532పెడుతున్నారుఅంటేమోర్తాడ్ మండలంలో అదనంగా పెరిగిన పెన్షన్లు కేవలం 82 మాత్రమే (+82) .. అదీ ఇస్తున్నది పాత రూ. 2000 వేలే
మరి మీరు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు 6 గ్యారెంటీ లో భాగంగా 57 సం. నిండిన వృద్దులకు 4000 వేలు
వికలాంగులకు 5000 వేలు
18 సం. నిండిన ప్రతి మహిళ కూ 2500 వందలు
ఇస్తానని చెప్పి 3 సంవత్సరాలుగా కాలయాపన చేస్తూ ఇప్పుడు కొత్తగా ఇచ్చే వారికి కేవలం 2 వేలు ఇస్తే గొప్పతనం ఏముంది?
పాత వారితో కలిసి కొత్తవారికి ఈనెల తో పాటు 4 వేలు పెన్షన్ ఇవ్వాలని కోరుతున్నాము.
అలాగే 57 సంవత్సరాలు నిండిన వృద్ధులకు కొత్తగా 4 వేలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూన్నాము.
ఈ మాత్రానికే
పెన్షన్ల పండగలు, మంత్రుల మీటింగ్ లు , 8 మండలాల్లో అధికారుల/ కాంగ్రెస్ నాయకుల మీటింగ్ లు కొత్త పెన్షన్ లకయ్యే డబ్బుల కంటే ప్రచారానికే ఎక్కువ ప్రజల ధనం ఖర్చవుతుందన్న సంగతి
నిజమా కాదా?
ప్రజల కు ఇచ్చిన హామీ మేరకు 2వేలు కాదు 4వేలు వికలాంగులుకు 5 వేలు ప్రతి మహిళ కూ 2500 పెన్షన్ మంజూరు చేయాలని, డిమాండ్ చేస్తున్నాము. కానీ పక్షంలో త్వరలో నే ప్రజల తరపున పోరాడడానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.ఈ కార్యక్రమంలో ఏర్గట్ల మాజీ జడ్పీటిసి రాజేశ్వర్ మోర్తాడ్ మాజీ వైస్ ఎంపీపీ తొగిటి శ్రీనివాస్ మాజీ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ పాపాయి పవన్ గోపిడీ సత్యనారాయణ ఇంతియాజ్ మాజీ ఎంపీటీసీ మధు యూసుఫ్ మహిపాల్ భూమారెడ్డి సందీప్ అశోక్ శ్రీను రాజారెడ్డి సంజాయ్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.



