వి బి జి రామ్ పథకంలో ఆవుల షెడ్డు నిర్మాణానికి భూమి పూజ
గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపు
సర్పంచ్ పుప్పాల నరేష్
తెలంగాణ కెరటం బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి నవంబర్ 20 :
నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక గ్రామీణ ఉపాధి హామీ పథకం
వి బి జి రామ్ జి కింద నూతన ఆవుల షెడ్డు నిర్మాణానికి శుక్రవారం ఘనంగా భూమి పూజ నిర్మాణ పనులను ప్రారంభించారు.ఈ సందర్భంగా సర్పంచ్ పుప్పాల నరేష్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో పాడి పరిశ్రమను పెంపొందించి పల్లెలు సస్యశ్యామలంగా, స్వయం సమృద్ధిగా ఎదగాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఇటువంటి విప్లవాత్మక పథకాలను ప్రవేశపెట్టిందని కొనియాడారు. కేంద్ర పథకాలను నియోజకవర్గ ప్రజల చెంతకు తీసుకురావడంలో నిరంతరం కృషి చేస్తున్న నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు l అరవింద్ ధర్మపురికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ప్రతి గ్రామంలో గతంలో మాదిరిగానే పాడి పశువుల పెంపకాన్ని యథావిధిగా కొనసాగిస్తూ, గ్రామాలు అన్ని రంగాల్లో బలోపేతం అయినప్పుడే 'వికసిత్ భారత్' నిర్మాణం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించే ప్రతి పథకం వెనుక పేద, మధ్యతరగతి రైతుల అభ్యున్నతి అనే స్పష్టమైన లక్ష్యం ఉంటుందని, అర్హులైన ప్రతి ఒక్కరూ కేంద్ర పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు అండగా ఉంటూ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ ఫలాలను ప్రతి ఇంటికీ చేరవేయడమే తమ ప్రథమ కర్తవ్యమని స్పష్టం చేశారు.ఈకార్యక్రమంలో ఉప సర్పంచ్ సదానందగౌడ్, గ్రామ కమిటీ పెద్దమనుషులు, వార్డ్ సభ్యులు, స్థానిక నాయకులు, గ్రామస్తులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



