ఆర్థిక భద్రతకు భీమా పథకాలు కీలకం..కలెక్టర్
ప్రజల కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడంలో జీవిత బీమా పథకాలు ఎంతో కీలకమని నిర్మల్ జిల్లా కలెక్టర్ భావేష్ మిశ్రా అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ రాష్ట్ర ప్రభుత్వ జీవిత బీమా పథకంపై అవగాహన పెంచుకొని వాటిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు కుటుంబ పెద్ద కు అనుకోకుండా ఏదైనా పెద్ద ప్రమాదం జరిగినప్పుడు నా కుటుంబానికి ఆర్థిక భరోసా కలిపించడంలో ఈ బీమా ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. అర్హులు భీమ పథకంలో నమోదు చేసుకోవాలని కోరారు.



