Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

కొత్తూరు తండాలో ఆంజనేయ స్వామి మాలధారుల ఆధ్యాత్మిక సందడి

Author
Posted By TELANGANA KERATAM
| 21 Nov 2026, 06:59 AM | 21 | Politics, తెలంగాణ
కొత్తూరు తండాలో ఆంజనేయ స్వామి మాలధారుల ఆధ్యాత్మిక సందడి
కొత్తూరు తండాలో ఆంజనేయ స్వామి మాలధారుల ఆధ్యాత్మిక సందడి
కొత్తూరు తండా (కారేపల్లి మండలం):
కారేపల్లి మండలం చిన్నమడంపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని కొత్తూరు తండా గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. గ్రామంలోని సీతారామచంద్ర స్వామి ఆలయంలో ఆంజనేయ స్వామి మాలధారులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.  
కాషాయ వస్త్రాలు, మాలలు ధరించిన స్వాములు ఆలయ ప్రాంగణంలో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో స్వాములు బానోత్ రవీందర్, బానోత్ సురేష్, ఇస్లావత్ దేవరాజ్, బానోత్ రామ్ సింగ్, మెట్ల హేమంత్ కుమార్, లకావత్ మోహన్, ధరావత్ యశ్వంత్, ధరావత్ వినోద్ కుమార్, భానోత్ దీపక్, బానోత్ గౌతమ్, భుక్య వీరన్న మరియు మంగీలాల్ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.  
గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని స్వాములు ఆంజనేయ స్వామిని వేడుకున్నారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంతో తండా పరిసర ప్రాంతాల్లో భక్తి భావం వెల్లివిరిసింది.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: