Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం – తెలంగాణ ప్రభుత్వం

Author
Posted By TELANGANA KERATAM
| 21 Nov 2026, 06:56 AM | 7 | Politics, తెలంగాణ
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం – తెలంగాణ ప్రభుత్వం
*ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం – తెలంగాణ ప్రభుత్వం*
తెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 20, నవంబర్
*తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రవేశపెట్టిన పథకం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం*.

*రూ.5 లక్షల జీవిత బీమా*

 *పథకం ముఖ్య వివరాలు*

* *బీమా మొత్తం: కుటుంబానికి రూ.5 లక్షలు*.

* *అర్హత: తెలంగాణ రాష్ట్ర రేషన్ కార్డు కలిగిన కుటుంబాలు*.

* *వయస్సు: బీమా పొందే వ్యక్తికి 18–59 సంవత్సరాలు*.

* *ఎవరికి వర్తిస్తుంది: కుటుంబంలో సంపాదించే ఒక వ్యక్తికి*.

* *ప్రీమియం: బీమా ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది*.

* *నామినీ: ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మందిని నామినీలుగా నమోదు చేసుకోవచ్చు*.

* *ప్రయోజనం: బీమా పొందిన వ్యక్తి మరణిస్తే నామినీలకు రూ.5 లక్షలు అందుతాయి*.

 *దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలి*?



* *మున్సిపల్ వార్డు పరిధిలో ఏర్పాటు చేసే ప్రత్యేక శిబిరాల్లో*.

* *అధికారుల ద్వారా నమోదు చేసుకోవచ్చు*.

*కావలసిన పత్రాలు*:

* *రేషన్ కార్డు*

* *ఆధార్ కార్డు*

* *మొబైల్ నంబర్*

* *నామినీ వివరాలు*

*నమోదు ప్రక్రియ 2026 నవంబర్ 19 నుంచి ప్రారంభమవుతోంది*. 

*15వ వార్డు ప్రజలకుమరియు ఆందోల్ జోగిపేట మున్సిపాలిటీ ప్రజలందరికీ ముఖ్య సూచన*

*ప్రజలందరూ ఈ పథకంపై అవగాహన కలిగి ఉండి*, *అర్హులైన కుటుంబాలు వార్డు పరిధిలో నిర్వహించే నమోదు శిబిరాల్లో దరఖాస్తు చేసుకోవాలి*.
*ఇట్లు* ,
*ఆకుల సత్వ నారాయణ చిట్టిబాబు వైస్ చైర్మన్ ఆందోల్ జోగిపేట మున్సిపాలిటీ*

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: