Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

గిరిజన చంచు పంటలకు తాగునీటి సౌకర్యం కల్పిస్తాం.

Author
Posted By TELANGANA KERATAM
| 21 Nov 2026, 07:05 AM | 4 | Politics, తెలంగాణ
గిరిజన చంచు పంటలకు తాగునీటి సౌకర్యం కల్పిస్తాం.
గిరిజన చంచు పంటలకు తాగునీటి సౌకర్యం కల్పిస్తాం.

ఇంటింటికి 10 లీటర్ల క్యాం డబ్బాలతో సరఫరా చేస్తాం.

సబ్ కలెక్టర్ సలోని చాబ్రా.

తెలంగాణ కెరటం నాగర్ కర్నూలు జిల్లా ప్రతినిధి (నవంబర్ 20):

 నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం లోని నల్లమల లోతట్టు అటవీ ప్రాంతంలో నివసిస్తున్న చెంచు గిరిజన పంట లో నివసిస్తున్న ప్రజలకు త్రాగునీటికి ఇబ్బంది లేకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట సబ్ కలెక్టర్ సలోని చబ్రా అధికారులను ఆదేశించారు. లెనోవా ప్రభావంతో వర్షపాతం తగ్గడం భూగర్భ జలాలు అడుగంటిపోయే ప్రమాదం ఉన్నందున నీటి సమస్య ఏర్పడిందని నేడు శుక్రవారం నుంచి చెంచుపెంటల్లో త్రాగునీరు అందించేందుకు కార్యాచరణ రూపొందించినట్లు సబ్ కలెక్టర్ తెలిపారు. చెంచుపెంటల్లోని గిరిజనులకు 10 లీటర్ల క్యాన్ చొప్పున ప్రతిరోజు అందించాలని ఆర్డబ్ల్యూఎస్, మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు. అటవీ ప్రాంతంలోకి భారీ ట్యాంకర్లు వెళ్లే పరిస్థితి లేనందున చెంచుపెంటల సమీపాన ట్యాంకర్ల నుంచి అక్కడి నుండి నీటిని ప్రతి ఇంటికి సరఫరా చేయాలని మిషన్ భగీరథ డి ఈ ఈ హేమలత ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో పనులు చేపట్టాలన్నారు. పాడైపోయిన బోర్ల మోటార్లమరమ్మతో, పైప్ లైన్ ల లీకేజీలను అరికట్టి సత్వర చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: