Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

పౌరసరఫరాల శాఖ కమిషనర్ నాగిరెడ్డిని కలిసిన ఎమ్మెల్యే జిఎంఆర్, రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ప్రతినిధులు..

Author
Posted By TELANGANA KERATAM
| 21 Nov 2026, 06:34 AM | 4 | Politics, తెలంగాణ
పౌరసరఫరాల శాఖ కమిషనర్ నాగిరెడ్డిని కలిసిన ఎమ్మెల్యే జిఎంఆర్,  రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ప్రతినిధులు..
పౌరసరఫరాల శాఖ కమిషనర్ నాగిరెడ్డిని కలిసిన ఎమ్మెల్యే జిఎంఆర్, 
రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ప్రతినిధులు..
తెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 20, నవంబర్
డీలర్ల సమస్యల పరిష్కారానికి సహకరించాలని విజ్ఞప్తి .

పటాన్చెరు:

రాష్ట్ర పౌరసరఫరాల శాఖ నూతన కమిషనర్ గా ఇటీవల నియమితులైన నాగిరెడ్డిని పటాన్చెరు శాసనసభ్యులు,  తెలంగాణ రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు గూడెం మహిపాల్ రెడ్డి నేతృత్వంలోని డీలర్ల సంక్షేమ సంఘం సభ్యులు మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. శుక్రవారం హైదరాబాదులోని ఆయన కార్యాలయంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో రేషన్ డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయనకు వివరించారు. ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా డీలర్లకు గౌరవ వేతనం, క్వింటాలుకు 300 రూపాయల కమిషన్, ఎలక్ట్రానిక్ ప్రింటెడ్ వే బ్రిడ్జిల ఏర్పాటు, 10 లక్షల రూపాయల ప్రమాద బీమా, ఆరోగ్య బీమా, తదితర అంశాలను అమలు చేయాలని కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన నాగిరెడ్డి.. ప్రభుత్వంతో చర్చించి డీలర్ల సమస్యల పరిష్కారానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తానని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే జిఎంఆర్ తెలిపారు. ఈ సమావేశంలో రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాయికోటి రాజు, రాష్ట్ర ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: