Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

నవగ్రహ ఆంజనేయ సహిత ఉమారామలింగేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే చింత ప్రభాకర్*

Author
Posted By TELANGANA KERATAM
| 21 Nov 2026, 06:45 AM | 4 | Politics, తెలంగాణ
నవగ్రహ ఆంజనేయ సహిత ఉమారామలింగేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే చింత ప్రభాకర్*
*నవగ్రహ ఆంజనేయ సహిత ఉమారామలింగేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే చింత ప్రభాకర్*
తెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 20, నవంబర్ 
సంగారెడ్డి పట్టణ శివారులోని గేట్‌వే మ్యానర్స్ వద్ద నూతనంగా నిర్మించిన నవగ్రహf ఆంజనేయ సహిత ఉమారామలింగేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ఠ మహోత్సవం అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ మహోత్సవానికి సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింత ప్రభాకర్ మాట్లాడుతూ.. ఇలాంటి పవిత్రమైన ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. స్వామివారి కృపతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. సమాజంలో ఆధ్యాత్మిక చింతన, భక్తిభావం మరింత పెంపొందాలని పేర్కొన్నారు.

అనంతరం పాత కంది గ్రామంలోని శ్రీ హనుమాన్ ఆలయ ప్రథమ వార్షికోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు.

ఈ కార్యక్రమాల్లో ఆలయ కమిటీ సభ్యులు, నిర్వాహకులు, గ్రామ పెద్దలు, భక్తులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: